Varanasi Leaked Video: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి ‘ చిత్రం పై పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అప్పుడే 80 శాతం పూర్తి అయ్యిందట. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి కెరీర్ లో అత్యంత వేగంగా పూర్తి అయ్యే సినిమా ఇదే కావొచ్చు. ఏప్రిల్ 7, 2027 న ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు. డిసెంబర్ నుండి పాన్ వరల్డ్ స్థాయిలో ప్రొమోషన్స్ ని కూడా మొదలు పెట్టబోతున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అవ్వకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
షూటింగ్ లొకేషన్ లో మొబైల్ ఫోన్ ని కూడా ఆయన బ్యాన్ చేసాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా లొకేషన్ లో ఫోన్ వాడేందుకు అనుమతి లేదు అన్నమాట. ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఈ సినిమా నుండి ఎదో ఒక వీడియో లీక్ అవుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో వీడియో లీక్ అయ్యింది. వారణాసి ఘాట్ సెట్ లో మహేష్ బాబు నీటిలోకి దిగుతూ ఈ వీడియో లో కనిపిస్తాడు. ఆయన లుక్స్ చాలా రఫ్ గా ఉన్నాయి. మహేష్ బాబు ని ఆయన అభిమానులు ఇలాంటి రఫ్ లుక్ లో ఇంతకు ముందు కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పటికే గ్లింప్స్ వీడియో ద్వారా మహేష్ బాబు ఎలా ఉండబోతున్నాడు అనేది అందరికీ అర్థం అయ్యింది. గ్లింప్స్ లో చూపించిన దానైకంటే , ఈ లీకైన వీడియో లో చాలా రఫ్ గా ఉన్నాడు మహేష్.
ఒక్కమాటలో చెప్పాలంటే సింహం లాగా ఉన్నాడు అనొచ్చు. ఇక సినిమాలో రాజమౌళి మహేష్ బాబు ని ఏ రేంజ్ లో చూపించి ఉంటాడో మీరే ఊహించుకోండి. సాధారణంగానే రాజమౌళి తన సినిమాల్లో హీరో ని దేవుడి లాగా చూపిస్తుంటాడు, ఇప్పుడు ఆయన ఏకంగా దేవుడి క్యారెక్టర్ ని వెండితెర మీద చూపించబోతున్నాడు. ఇక ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇక పోతే ఈ నెల 9 న మహేష్ బాబు పుట్టినరోజు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ‘వారణాసి’ లోని మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని లుక్స్ ని అధికారికంగా విడుదల చేయబోతున్నారట మూవీ టీం. దాంతో పాటు ఒక స్వీట్ సర్ప్రైజ్ కూడా ఉంటుందని టాక్. మరి ఆ స్వీట్ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
MASSIVE 'VARANASI' LEAK!
Ghats Fight: Mahesh Babu (Rudhra) in a high-octane action sequence.#MaheshBabu #SSRajamouli #Varanasi pic.twitter.com/pYuNIRUFTd
— sushil kadam (@imsushilkadam) August 6, 2026