Pakistan Vs India: ఉగ్రవాద దేశం పాక్ కు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. బయటకు వెళ్తే అప్పు ఇచ్చేవాడు లేడు. పోనీ సొంతంగా డబ్బులు సంపాదించుకునే తెలివి లేదు. మత పిచ్చి ఉంది. ఉగ్రవాదుల అండ దండిగా ఉంది. అవేమీ డబ్బులు సంపాదించే మార్గాలు కాదు కదా. డబ్బులు ఉంటేనే ఇతర దేశాలు విలువ ఇస్తాయి. లేకుంటే చీడపురుగులాగా చూస్తుంటాయి. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని దేశాలు ఏదో ఆశించి సహాయం చేస్తుంటాయి గాని.. అదేదీ స్థిర కాలం నిలబడదు. అయితే ఉగ్రవాద దేశానికి ఒకవేళ సహాయం చేస్తే.. అంతిమంగా ఆ దేశానికి మన నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి తుర్కియే దేశానికి మన నుంచి అనుభవంలోకి వస్తోంది.. అది అలాంటి ఇలాంటి అనుభవం కాదు.. ఏకంగా 1,500 కోట్ల విలువైన అనుభవం.
Also Read: మోదీ వార్నింగ్‌పై స్పందించిన పాకిస్తాన్.. సుదీర్ఘ ప్రకటన విడుదల
ఆపిల్స్ బ్యాన్
తుర్కియే ప్రాంతంలో ఆపిల్స్ విస్తారంగా పండుతుంటాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతం నుంచి భారతదేశానికి చెందిన వ్యాపారులు 1500 కోట్ల విలువైన ఆపిల్స్ దిగుమతి చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో తుర్కియే దాయాది దేశానికి అంతర్గతంగా సహకరించింది. మనతో యుద్ధం జరుగుతున్నప్పుడు రక్షణ పరికరాలు ఎగుమతి చేసింది. ఆ పరికరాలు ఉత్తిగానే తుస్సుమన్నాయి. అయినప్పటికీ మన మీద తుర్కియే దేశానికి ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో ఆ సంఘటన నిరూపించింది. దీంతో మన మీద కక్షగట్టిన తుర్కియే దేశం మీద మన దేశానికి చెందిన వ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వాణిజ్య తరహా యుద్ధానికి తెర లేపారు. తుర్కియే ప్రాంతం నుంచి దిగుమతి చేసుకునే ఆపిల్స్ ను బ్యాన్ చేశారు. దీంతో తుర్కియే లబో దీపోమంటున్నది. అంతేకాదు మన దేశం నుంచి తుర్కియే ప్రాంతానికి వెళ్ళకూడదని ఏకంగా సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో మాల్దీవులకు మన నుంచి ఎలాంటి అనుభవం ఎదురయిందో.. ఇప్పుడు తుర్కోయే కు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతోంది. మొత్తంగా అటు పర్యాటకం.. ఇటు ఆపిల్స్ వల్ల తుర్కియే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దేశం నుంచి భారత్ మాత్రమే భారీగా ఆపిల్స్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు అది పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడి ఆపిల్స్ తోటలు ఎందుకూ పనికిరాని పరిస్థితి ఏర్పడింది. ” మన దేశం మీద ఆధారపడి బతికే తుర్కి యే చివరికి ఇలాంటి దుస్థితి ఎదుర్కొంటోంది. దాయాది దేశానికి సహాయం చేయకుండా ఉండి ఉంటే మేము ఇంతటి నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడైతే అది ఉగ్రవాద దేశానికి సపోర్ట్ ఇచ్చిందో అప్పుడే మా ధోరణి మారింది. ఏదైనా సరే అని దాన్ని పక్కన పెట్టాం. ఈసారి ఆపిల్స్ దిగుమతి చేసుకునేది లేదని స్పష్టం చేశాం. ఇప్పుడే కాదు ఇకపై కూడా ఆపిల్స్ దిగుమతి చేసుకునేది లేదని” ఇండియన్ ఆపిల్ మర్చంట్స్ చెబుతున్నారు.
India के Pakistan साथ हालिया तनाव के बीच Turkey द्वारा पाकिस्तान को समर्थन दिए जाने के बाद पुणे के apple व्यापारियों ने तुर्की के apples का बहिष्कार करने का फैसला किया है।#operationsindoor #TurkeyApple #India #indiaagainstterror #BoycottTurkey pic.twitter.com/zlL5TpBCZX
— Zee Business (@ZeeBusiness) May 13, 2025