Hyderabad Nurse Death: అది హైదరాబాద్ నగరం.. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి.. తుక్కుగూడ ప్రాంతం.. ఇక్కడ ప్రైమ్ కేర్ అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో ఒక నర్స్ పనిచేస్తోంది. ఈమె శుక్రవారం రాత్రి తన విశ్రాంతి గదిలో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో ఆమెతో పాటు పనిచేస్తున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ట్రైన్ కేర్ ఆస్పత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఒక యువతి నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రిలో పనిచేసే నర్సులకు యాజమాన్యం లో విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. అదే గదిలో తనతో పాటు పనిచేసే మరో నర్స్ కూడా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అయితే ఆరోజు ఆ నర్స్ లేదు. కేవలం ములకలపల్లి మండలానికి చెందిన యువతి మాత్రమే ఉంది. ఆరోజు ఆమె ఒక్కతే ఉండగా ఒక వ్యక్తి ఆ గది కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించాడు. అతడు లోపలికి రాగానే ఆ యువతి గట్టిగా అరిచింది. దీంతో అతడు ఆమె గొంతు నులిమి చంపేశాడు. మరుసటి రోజు మరో నర్స్ వచ్చింది. గది తలుపుతట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి విషయం చెప్పింది. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గది కిటికీలు నుంచి చూడగా.. ఆ నర్స్ చనిపోయి కనిపించింది. ఆమె ముఖం మీద.. కాళ్ళ మీద గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆ నర్స్ ను బీహార్ రాష్ట్రానికి చెందిన సైనా ఉల్లా అనే వ్యక్తి చంపేసినట్టు తెలుస్తోంది. చనిపోయిన తరమృతదేహంపై ఆమె మృతదేహంపై అతడు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే ఒక కంచనాకు వస్తామని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కోల్కతా నగరంలో ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పీజీ విద్యార్థి తరహాలోనే ఈ ఘటన కూడా జరిగింది. ఆరోజు ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకొని తన గదిలో విషయాన్ని తీసుకుంటున్న ఆ విద్యార్థిని మీద సంజయ్ రాజు అనే వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటిస్తే దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.
చనిపోయిన ఆ యువతి పెద్ద కుటుంబం. దమ్మపేట మండలం అంకంపాలెంలో ట్రైబల్ గురుకుల పాఠశాలలో 10 వరకు చదివింది. భద్రాచలం గురుకుల కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాదులో నర్సింగ్ ట్రైనింగ్ తీసుకుంది. ఆదిమతి తండ్రి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆ యువతీ సోదరుడు రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అతడు కూడా గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబానికి అండగా ఉండాలని ఉద్యోగంలో చేరిన ఆమె.. చివరికి ఇలా బలి కావడం ఆవేదన కలిగిస్తోంది.