Pakistan Driverless Car: ఉగ్రవాదులకు ఆ దేశం అడ్డా.. తుపాకులకు, బాంబులకు ఆ ప్రాంతం కేరాఫ్ అడ్రస్. దరిద్రానికి.. దారుణాలకు.. దుర్మార్గాలకు ఆ నేల చిరునామా. అటువంటి దేశంలో ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందా.. కొత్త కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందా.. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ కథనం మీరు చదవాల్సిందే.
పాకిస్తాన్.. ఈ పేరు మన మదిలో మెదిలితే మనకు ఖచ్చితంగా ఉగ్రవాద దేశం గుర్తుకొస్తుంది. పాకిస్తాన్ దేశంలో వనరులు ఉన్నాయి. కష్టపడి పని చేసే ప్రజలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడి పరిపాలకులకే బుర్రలో గుజ్జు ఉండదు. అధికారాన్ని సొంతం చేసుకోవడానికి.. సొంతం చేసుకున్న అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి నిత్యం ప్రజల్లో విష బీజాలు నాటుతూ ఉంటారు. అంతేకాదు, ఉద్వేగ పరమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఆగ్రహాలు కలిగిస్తూ ఉంటారు.
అక్కడి పాలకులకు అధికారం అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి చివరికి ఉగ్రవాదులతో కూడా జట్టు కట్టడానికి వెనుకాడరు. ప్రజల కోసం ఉపయోగించాల్సిన డబ్బులను ఉగ్రవాదుల కోసం వినియోగిస్తూ ఉంటారు పాకిస్తాన్ దేశ పరిపాలకులు. అందువల్లే కొన్ని దశాబ్దాలు కాలంగా పాకిస్తాన్ దేశంలో అభివృద్ధి అనేది ఆగిపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా నేలచూపులు చూస్తాయి. సరైన రోడ్లు లేవు. తాగునీరు సక్రమంగా సరఫరా కాదు.. ఇంకా చెప్పాలంటే అక్కడ ఏది గొప్పగా ఉండదు. బతకాలి కాబట్టి అక్కడ ప్రజలు ఏదో విధంగా బతికేస్తూ ఉన్నారు.
దరిద్రానికి.. కరుడుగట్టిన ఉగ్రవాదానికి నిలువెత్తు ప్రతిరూపంగా ఉండే పాకిస్తాన్ దేశంలో ఇటీవల ఒక యువకుడు ప్రయోగం చేశాడు. డ్రైవర్ లేకుండా కారును తయారు చేశాడు. డ్రైవర్ లేకుండా ఈ కారు నడుస్తుందని అతడు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మీడియా విలేకరులను పిలిచాడు. వారంతా కూడా ఆ యువకుడు తయారుచేసిన డ్రైవర్ లెస్ కార్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ లోగానే ఒక రిపోర్టర్ ఆ కారును టెస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కారు పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. అకస్మాత్తుగా నెట్ కనెక్షన్ కట్ కావడంతో ఆ కారు ఇలా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. శాటిలైట్.. ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఈ కారును ఆపరేట్ చేయవచ్చు. కానీ ఆ కనెక్షన్లు కట్ కావడంతో కారు పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఉగ్రవాదులకు అడ్డా లాంటి దేశంలో ఆవిష్కరణలకు ఆస్కారం ఎలా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.
The car is remotely controlled over the internet through an app or computer.
Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH
— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026