Homeఅంతర్జాతీయంMaho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోగానే ఆ సమీపంలో భారీగా శబ్దం వచ్చింది. ఏంటని చూడగానే పర్యాటకులు షాక్ అయ్యారు. వారు మరింత షాక్ అయ్యే పరిణామం అక్కడ చోటుచేసుకుంది. పర్యాటకులు సముద్రపు ఒడ్డున కూర్చుని అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే.. ఆ సమీప ప్రాంతంలో విమానం టేక్ […]

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోగానే ఆ సమీపంలో భారీగా శబ్దం వచ్చింది. ఏంటని చూడగానే పర్యాటకులు షాక్ అయ్యారు. వారు మరింత షాక్ అయ్యే పరిణామం అక్కడ చోటుచేసుకుంది.

పర్యాటకులు సముద్రపు ఒడ్డున కూర్చుని అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే.. ఆ సమీప ప్రాంతంలో విమానం టేక్ ఆఫ్ అయింది. భారీ విమానం.. కిందికి దిగుతుండగా విపరీతమైన శబ్దం వచ్చింది. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ అయినప్పటికీ.. విమానం వచ్చిన వేగానికి గాలి పుట్టింది. ఆ గాలి కూడా బీభత్సంగా వచ్చింది. ఎంత బీభత్సంగా అంటే.. ఒక పెను తుఫాను వల్ల గాలులు ఏ స్థాయిలో వీస్తాయో.. ఆ స్థాయిలో అక్కడ గాలి వీచింది. గాలి తీవ్రతకు పర్యాటకులు ఎగిరిపడ్డారు. కొందరు ఈ దృశ్యాలను తమ కెమెరాలలో బంధించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారు గాలి తీవ్రతగా తట్టుకోలేక కింద పడిపోయారు..

ఈ సంఘటన కరేబియన్ దీవులలో చోటుచేసుకుంది. ఇక్కడి సింట్ మార్టిన్ దేశంలో మహో బీచ్ కు దగ్గర్లో విమానం టేక్ ఆఫ్ అయింది. అప్పటికి వాతావరణం ఉదృతంగా ఉంది. మబ్బులు పట్టేశాయి. మరికొంత సేపట్లో వర్షం కురుస్తుంది అన్నట్టుగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. విమానం సాంకేతిక లోపం వల్ల టేక్ ఆఫ్ అయిందా.. లేదా వాతావరణంలో మార్పుల వల్ల కిందికి దిగిందా అనేది తెలియ రాలేదు. కాకపోతే భారీ శబ్దంతో కిందికి దిగింది. గాలి కూడా విపరీతంగా తీర్చడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. సముద్రపు ఒడ్డున ఉన్న పర్యాటకులు ఎగిరిపడ్డారు. కొందరయితే భయంతో కేకలు వేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఇటీవల కాలంలో విమానాలలో సాంకేతిక లోపాలు ఏర్పడడం సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో విమానాలు ప్రమాదాలకు కూడా గురవుతున్నాయి. ఈ సమయంలో ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంటున్నది. అందువల్లే చాలా వరకు విమాన సంస్థలు ఒకటికి రెండుసార్లు లోహ విహంగాలకు పరీక్షలు నిర్వహించి.. సర్వీసులు నడుపుతున్నాయి. అయితే కరీబియన్ దీవుల్లో ల్యాండ్ అయిన విమానంలో ఎటువంటి సమస్య ఏర్పడింది.. అది ఏ కంపెనీకి సంబంధించిన విమానం అనే విషయాలు బయటికి తెలియ రాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper