Operation Sindoor: భారతదేశంపై అనవసరంగా విమర్శలు చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి చేసే చివరి కార్యక్రమాలలో తన దేశ సైన్యాన్ని దించింది. పైగా ఆ ఫోటోలను తమ దేశం మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేయించుకుంది. తమ దేశ పౌరులను అకారణంగా పొట్టన పెట్టుకుందని ఆరోపించింది. ఉగ్రవాదులకు కాస్త పాకిస్తాన్ పౌరులు అనే కలరింగ్ ఇచ్చింది. అంతేకాదు భారతదేశంపై అకారణంగా దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. దానిని పక్కనపెట్టి సరిహద్దుల్లో దారుణాలకు పాల్పడింది. అకారణంగా కాల్పులకు తెగ బడింది. దీంతో భారత్ గర్జించిన సింహం లాగా పాకిస్తాన్ మీద పడింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ దేశానికి ట్రైలర్ మాత్రమే చూపించిన భారత్.. ఆ తర్వాత ఒక్కో శాంపిల్ చూపించడం మొదలుపెట్టింది. ఒకటి, కాదు రెండు కాదు పాకిస్తాన్ ఊహించని స్థాయిలో దాడులు చేసుకుంటూ వెళ్ళింది. కరాచీ పోర్టును బద్దలు కొట్టింది. రాజధాని ఇస్లామాబాదులో దీపావళి పండుగ చేసింది.. చివరికి పాకిస్తాన్ ప్రధాని ప్రాణంతో పరుగులు పెట్టే విధంగా చేసింది. బంకర్లో దాక్కుంటే తప్ప బతకలేని పరిస్థితిని తీసుకొచ్చింది.
Also Read: ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ తో సినిమా..హీరో ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!
రాజ్ నాథ్ నవ్వులు
పాకిస్తాన్ దేశానికి దీపావళి పండుగ కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులతో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ఆ సమావేశం జరుగుతోంది. పహల్గాం ఘటన జరిగిన నాటి నుంచి కేంద్ర రక్షణ శాఖ మంత్రి సీరియస్ ముఖంతోనే కనిపించారు. కానీ నిన్న జరిగిన దాడుల తర్వాత ఆయన ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నారు. చర్చల విషయంలోనూ నవ్వుతూనే అధికారులకు సలహాలు.. సూచనలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ కు ఇంకా గట్టిగా బదులు చెప్పడానికి చాలా ప్రణాళికలే ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయే రిటర్న్ గిఫ్టులు భారత్ రెడీగా ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ముఖంలో కనిపిస్తున్న భావాల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు భారత్ చేసిన దాడుల వల్ల పాకిస్తాన్ దేశానికి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఫండ్ ఇచ్చే అప్పుల తోనే నెట్టుకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవేళ గనుక ఆ సంస్థలు అప్పులు ఇవ్వకపోతే పాకిస్తాన్ దేశానికి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ దాకా వచ్చింది అంటే ఇక పాకిస్తాన్ దేశం అనేది ప్రపంచ పటంలో కనిపించదు. పాకిస్తాన్ అనే పేరు వినిపించదు. చెప్పండి మీ మోడీకి అని అనడం ఉగ్రవాదులకు అత్యంత సులభం కావచ్చు. కానీ మోడీ విన్న తర్వాత భూమి మీద బతకడం ఉగ్రవాదులకు అంత సులభం కాదు. ఆ విషయం ఉగ్రవాదులకు అర్థమవుతోంది. పాకిస్తాన్ దేశానికి మరింతగా అర్థం అవుతోంది.
త్రివిధ దళాధిపతుల సమావేశంలో నవ్వుతూ కనిపించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అధికారులు #IndiaPakistanWar #RajnathSingh pic.twitter.com/cZt9dYxH16
— BIG TV Breaking News (@bigtvtelugu) May 9, 2025