OnePlus N6X: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది తక్కువ బడ్జెట్ లో మొబైల్ కొనాలని చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు కొన్ని స్పెసిఫికేషన్లు తగ్గించి తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ ‘ఎన్’ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైలో ఉండే స్పెషిఫికేషన్స్, ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
వన్ ప్లస్ నుంచి ఎన్ సిరీస్ లో ‘వన్‌ప్లస్ ఎన్6ఎక్స్’ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది 6.8 అంగుళాలహెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఫోన్ లో ప్రాసెసర్ విషయానికొస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ను ఉంచారు. ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.
వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఫోన్‌లో ప్రధాన భారీ బ్యాటరీని ఉంచారు. రోజూవారీ వినియోగానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలా ఇందులో 7,000 ఎంఏహెచ్ ప్రవేశపెట్టారు. దీనికి 15 వాట్ ఛార్జింగ్‌తో పాటు 6 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది. కెమెరా విభాగంలో వెనుక వైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ఫ్రంట్ లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. మెరుగైన ఫోటోగ్రఫీ కోసం ఏఐ ఫీచర్లను అందించారు.
4 ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ను రూ. 18,999 తో విక్రయిస్తున్నారు.అలాగే 4 ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఉన్న ఫోన్ ను రూ. 20,499తో సేల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మొబైల్ రూ. 20 వేల లోపే రానుంది. అయితే ఈ మొబైల్ కొనుగోలుపై ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత బేస్ వేరియంట్‌ను రూ. 17,499 కే సొంతం చేసుకోవచ్చు.