Homeబిజినెస్OIS Smartphones Under 20000: రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో OIS ఫోన్లు.. ఈ...

OIS Smartphones Under 20000: రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో OIS ఫోన్లు.. ఈ మూడు టాప్..

OIS Smartphones Under 20000: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. కొందరు మొబైల్ ద్వారానే ప్రాజెక్ట్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు. అయితే చాలామంది తక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్ కొనాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు ఆకర్షణీయమైన డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న ఫోన్లు యూజర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇవి తక్కువ వెలుతురు […]

OIS Smartphones Under 20000: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. కొందరు మొబైల్ ద్వారానే ప్రాజెక్ట్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు. అయితే చాలామంది తక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్ కొనాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు ఆకర్షణీయమైన డివైజ్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న ఫోన్లు యూజర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇవి తక్కువ వెలుతురు లో బ్లర్ లేని స్పష్టమైన ఫోటోలు, స్థిరమైన వీడియోగ్రఫీని అందిస్తుంటాయి. వాటిలో ఈ మూడింటి గురించి తెలుసుకుందాం..

మోటోరోలా మోటో G85 5G :
మొబైల్ మార్కెట్లో Motorola కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Moto G85 5G డిజైన్ తో పాటు డిస్ ప్లే పరంగా ఆకట్టుకుంటోంది. ఈ మొబైల్ లో 50 మెగా పిక్సెల్ సోనీ లైటియా ప్రైమరీ కెమెరాను అమర్చారు. 8 ఎంపీ ఆల్ట్రావైడ్ లెన్స్ ను అమర్చారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 6.67 అంగుళాల పోల్డ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని ధర రూ. 17,999 గా ఉంది.

రియల్‌మీ 12 ప్లస్ 5G:
ప్రీమియం ఫోన్ వలె డిజైన్ తో కూడిన ఫోన్ తక్కువ ధరకే కొనాలంటే రియల్ మీ కంపెనీకి చెందిన 12 ప్లస్ 5జీ కెమెరా సెంట్రిక్ ఫోన్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 8 ఎంపీ ఆల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాలు ఇందులో కనినిస్తాయి. సెల్ఫీ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరాను సెట్ చేశారు. ఈ మొబైల్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనిని రూ. 19,100తో విక్రయిస్తున్నారు.

iQOO Z9 5G:
ఫొటోగ్రఫీ తో పాటు హెవీ గేమింగ్ కోరుకునేవారికి ఐక్యూ కంపెనీకి చెందిన ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను అందించారు. 2 ఎంపీ సెన్సార్ తో పాటు 4కె రిజల్యూషన్ తో కూడిన వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు ఇవ్వనుంది. దీనిని రూ. 18,499తో కొనుగోలు చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper