Homeఆధ్యాత్మికంToday 1 August 2026 Horoscope: ఈ రాశి ఈరోజు వారు కొత్త వ్యక్తులతో...

Today 1 August 2026 Horoscope: ఈ రాశి ఈరోజు వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త..

Today 1 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ఏర్పడిన కొత్త వ్యక్తుల పరిచయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. […]

Today 1 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ఏర్పడిన కొత్త వ్యక్తుల పరిచయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరిగిపోతాయి. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చురుగ్గా ఉండడంతో చదువుల్లో రాణిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. ఎవరికి రహస్యాలు చెప్పకూడదు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు పట్టు విడవాలి. ఇతరులను గౌరవించడం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అనుకోకుండా డబ్బు ఇంట్లోకి వస్తుంది. వ్యాపారులు అధిక లాభాలు పడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి వ్యక్తిగత జీవితాల్లో అనేకం మార్పులు కనిపిస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సలహాలు తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా అదృష్టం వరించి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్తగా పలులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. రోజువారి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి విజయవంతంగా ముందుకు వెళ్తారు. మానసికంగా ప్రశాంతత కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులకు వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించే ముందు ఇతరుల సలహా తీసుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసి ఉంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. అనవసరపు రాద్ధాంతాలకు దూరంగా ఉండాలి. కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సలహా తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకోకుండా అదృష్టం వరించనుంది. ఆలోచనలకు తగిన విధంగా పనులు చేయాలి. వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆదాయం పెరిగినా కూడా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో తెలివిగా ప్రవర్తించాలి. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పిల్లల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు అధిక లాభాలు పొందుతారు. వీరికి ఏర్పడే కొత్త పరిచయాలతో అధిక లాభాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఉద్యోగులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సృజనాత్మకత మెరుగుపడడంతో నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఖర్చులు చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper