Operation Sindoor: భారత్, పాక్ యుద్ధ నేపథ్యంలో భారత ఆర్మీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరిన్ని అధికారాలను కట్టబెట్టారు. ఇప్పటికే భారత్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని తాజాగా పాకిస్తాన్ చేస్తున్న యుద్ధంతో సైన్యానికి మరింతగా బలం పెంచేందుకు అదనపు అధికారులను తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా టెరిటోరియల్ ఆర్మీ ని రంగంలోకి దించాలని భారత ఆర్మీ రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీ ఎలా పనిచేస్తుంది?
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
1948 ఆగస్టు 18న టెరిటోరియల్ ఆర్మీ చట్టం రాజ్యాంగ సభ ద్వారా అమలు చేశారు. ఈ ఆర్మీలో ఇన్ పాంట్రీ బెటాలియన్లు వంటివారు పార్ట్ టైం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీది సేవలవల్ల ఆర్మీ కి ఉపశమనం కలుగుతుంది. జాతీయ అవసరాల్లో, విపత్తు సమయంలో వీరి సహాయం తీసుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాల్లోనూ, నిత్యవసరాల నిర్వహణలోనూ టెరిటోరియల్ ఆర్మీ సేవ చేస్తూ ఉంటుంది. మీరు ఆర్మీ డ్రెస్ తో సేవలు చేస్తారు. ఒక్కోసారి సివిల్ డ్రెస్ లోను సాయం చేస్తూ ఉంటారు.
టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆర్మీకి మద్దతుగా అంతర్గత భద్రతా విధులు నిర్వహిస్తుంది. మరోవైపు పౌరులకు సేవ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో 65 డిపార్ట్మెంటల్, 9 డిపార్ట్మెంటల్ యూనిట్లతో కూడిన 50 వేల మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో మీరు అవసరం ఏర్పడినట్లు భారత్ గుర్తించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెరిటోరియల్ ఆర్మీ సేవలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటికే త్రివిధ దళాలు పాకిస్తాన్ కునుకు లేకుండా దాడులను తిప్పుకొడుతుంది. మరోవైపు ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా మరింతగా ఆర్మీకి బలం చేయకూడదు ఆర్మీ ని తీసుకుంటే ఆర్మీకి అదనపు శక్తి వచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.
మరోవైపు పాకిస్థాన్కు ఆర్మీ నుంచే కాకుండా ఇతను మార్గాల నుంచి కూడా చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే వరదల కారణంగా చైనా నది గేట్లను ఎత్తివేయడంతో పాకిస్తాన్ కు తీవ్ర వరద వెళ్ళింది. ఈ క్రమంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక తాజాగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి సైతం పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వట్లేదని తెలుస్తోంది. తాజాగా జలాల పంపకంపై తాము జోక్యం చేసుకోలేమని అజయ్ బంగా చేసి చెప్పారు. ఇలా రకరకాలుగా పాకిస్థాన్ కట్టడి చేయడానికి భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
Also Read: త్రివిధ దళాధిపతుల మీటింగ్లో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ నవ్వులు.. అంటే పాకిస్తాన్ కథ ముగిసినట్టేనా??