Homeవింతలు-విశేషాలుClothing Quality Tags: మీ బట్టలు ఏంటో.. కాలర్ వెనకాల ట్యాగులు చెబుతాయి.. ఎలానో తెలుసా..

Clothing Quality Tags: మీ బట్టలు ఏంటో.. కాలర్ వెనకాల ట్యాగులు చెబుతాయి.. ఎలానో తెలుసా..

Clothing Quality Tags: ఒక మనిషి రూపాన్ని బట్టలు డిసైడ్ చేస్తాయి. మనం వేసుకునే బట్టలే సమాజంలో గౌరవాన్ని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు అంటే దుస్తుల తయారీ ఈ స్థాయిలో ఉండేది కాదు. మార్కెట్ ఇంతటి విస్తృతంగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దుస్తుల స్థాయి పెరిగిపోయింది. మనీ స్పెక్యులేషన్ పెరిగిపోవడంతో.. బట్టల వినియోగం కూడా పెరిగిపోయింది. మార్కెట్లో లెక్కకు మిక్కిలి కంపెనీలు దుస్తులు తయారు చేస్తున్నాయి. రకరకాల దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటిల్లో కొత్త కొత్త […]

Clothing Quality Tags: ఒక మనిషి రూపాన్ని బట్టలు డిసైడ్ చేస్తాయి. మనం వేసుకునే బట్టలే సమాజంలో గౌరవాన్ని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు అంటే దుస్తుల తయారీ ఈ స్థాయిలో ఉండేది కాదు. మార్కెట్ ఇంతటి విస్తృతంగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దుస్తుల స్థాయి పెరిగిపోయింది.

మనీ స్పెక్యులేషన్ పెరిగిపోవడంతో.. బట్టల వినియోగం కూడా పెరిగిపోయింది. మార్కెట్లో లెక్కకు మిక్కిలి కంపెనీలు దుస్తులు తయారు చేస్తున్నాయి. రకరకాల దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటిల్లో కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా సంస్కృతిని.. అధునాతన కల్చర్ ను ప్రతిబింబిస్తున్నాయి.

దుస్తుల తయారీలో ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన విధానాన్ని పాటిస్తూ ఉంటుంది. దుస్తులు ఎలా తయారుచేసినప్పటికీ.. వాటి క్వాలిటీని మనం ఇట్టే తెలుసుకోవచ్చు. ఎందుకంటే దుస్తుల వెనుక ఉన్న కాలర్ లలో వేసే ట్యాగులే వాటి క్వాలిటీ చెబుతాయి. ఇంతకీ ఆ ట్యాగులు ఎలా ఉంటాయి.. వాటిని ఏ విధంగా రూపొందిస్తారు.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దుస్తుల వెనకాల కాలర్లో బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో గోల్డ్ రంగులో అక్షరాలు ఉంటే అది ప్రీమియం క్వాలిటీ అని అర్థం.

దుస్తుల వెనకాల ఉన్న కాలర్ బ్లాక్ కలర్ లో ఉండి.. అక్షరాలు వైట్ కలర్ లో ఉంటే.. అది మంచి క్వాలిటీతో పాటు.. ఎక్కువ రోజులపాటు వాషింగ్ చేసిన సరే బాగుంటుందని అర్థం.

ఒకవేళ కాలర్ వెనకాల ఉన్న ట్యాగ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ లో ఉండి.. అక్షరాలు బ్లాక్ కలర్ లో ఉంటే.. అది ఒక మోస్తరు క్వాలిటీ అని అర్థం.

కాలర్ వెనకాల ఉన్న ట్యాగ్ షేడ్ అయి ఉండి.. అక్షరాలు కూడా గజిబిజిగా ఉంటే.. ఆ క్లాత్ క్వాలిటీ బిలో యావరేజ్ అని అర్థం. ఎక్కువ రోజులు వాష్ చేస్తే ఆ క్లాత్ పాడైపోతుందని అర్థం.

తెలుసుకున్నారు కదా.. ఇకపై మీరు దుస్తులు కొనుగోలు చేస్తున్నప్పుడు.. కేవలం ధర మాత్రమే కాదు.. ఈ ట్యాగులు కూడా చెక్ చేయండి. ఆ ట్యాగుల ఆధారంగానే దుస్తులను కొనుగోలు చేయండి. అంతేకాదు దీనివల్ల మీరు మోసపోరు. మోసపోవడానికి అవకాశం కూడా ఉండదు. పైగా ఈ విషయాలు తెలియడం వల్ల నాణ్యమైన దుస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper