Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. కేవలం పాక్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా భారత్ దాడులు నిర్వహించింది. ఇందులో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ మళ్లీ భారత్‌పై దాడికి పాల్పడింది. గురువారం జమ్మూకశ్మీర్ ఎయిర్‌పోర్టుపై దాడులు చేసింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాక్ దాడులకు పాల్పడింది. వీటిన్నింటిని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. భారత దేశంపై డ్రోన్లతో విరుచుకుపడటంతో ఇండియన్ ఆర్మీ వాటిని కూప్పకూల్చింది. అయితే భారత్‌పై పాక్ జరిపిన అన్ని దాడుల్లో కూడా పాక్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ చైనా ఆయుధాలతో దాడులు పాల్పడింది. ఈ ఆయుధాల గురించి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకునేది. కానీ ఈ చైనా ఆయుధాల దాడితో పరువు పోగొట్టుకుంది. చైనా ఆయుధాలు చాలా పవర్ ఫుల్ అని భావించేది. కానీ ఇవి ఇండియాలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం వాటిని నాశనం చేసింది. పాక్ JF-17, F-16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి దిగింది. వీటిని భారత్ కూల్చివేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే చైనా రక్షణ వ్యవస్థ భారీగా విఫలమైందని చెప్పవచ్చు.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
చైనా ఆయుధాలలో JF-17 అత్యంత ప్రత్యేకమైన ఆయుధంగా భావిస్తోంది. చైనా పాక్‌కు ఫుల్ సపోర్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో చైనాకి చెందిన JF-17 యుద్ధ విమానాలను పాక్ తన నౌకాదళంలో యాడ్ చేసుకుంది. అయితే వీటిని చైనా సహకారంతో పాకిస్థాన్ తయారు చేసింది. ఇవే కాకుండా పాక్ చైనా నుంచి J-10C మల్టీరోల్ ఫైటర్ జెట్‌ను కూడా కొనుగోలు చేసింది. అయితే ఇండియాలోని LCA తేజస్‌తో పోల్చిన JF-17ను భారత్ చిత్తుగా కూల్చేసింది. అత్యాధునికమైన వాటితో తయారు చేసిన ఈ జెట్‌లను భారత సైన్యం కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూల్చేసింది. దీంతో పాటు పాక్ HQ-9ను కూడా ఉపయోగించింది. చైనా ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని చైనా ప్రెసిషన్ మెషినరీ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇది గాల్లో ఉన్న వాటిని కూడా నాశనం చేస్తుంది. కానీ భారత సైన్యం చేతిలో ఇది కూలిపోయింది. బ్రహ్మోస్ క్షిపణుల, రాఫెల్, సుఖోయ్ వంటి వైమానిక దాడుల కోసం పాక్ 2021లో ఈ జెట్‌ను తీసుకుంది. ఇది ఒకేసారి 100 లక్ష్యాలను కూడా గురి చేసి దాడి చేస్తుంది. ఇది దాదాపుగా 200 కి.మీ పరిధి వరకు వెళ్తుంది. ఇలా పాక్ దగ్గర మొత్తం 400 కంటే ఎక్కువగా జెట్‌లు ఉన్నాయి. అయితే చైనాకి చెందిన ఈ జెట్‌లను భారత్ ఈజీగా నాశనం చేసింది.