Homeఆధ్యాత్మికంTaurus Zodiac : ఈ రెండు రాశుల వారి ఇంట్లో నుంచి లక్ష్మి దేవి వెళ్లమన్నా...

Taurus Zodiac : ఈ రెండు రాశుల వారి ఇంట్లో నుంచి లక్ష్మి దేవి వెళ్లమన్నా వెళ్లదు.. ఎందుకంటే?

Taurus Zodiac : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశుల చక్రం తో వ్యక్తుల జీవితాలు ముడిపడి ఉంటాయని ఆధ్యాత్మిక వాదుల భావన. కొన్ని రాశుల కలిగిన వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుందని.. వీరికి ధన లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి రాశుల్లో వృషభ, తుల రాశులు ఉన్నాయి. ఈ రాశులకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. దీంతో వీరి ఇంట్లో సంపద, విలాసం, భోగభాగ్యాలు ఉంటాయంటున్నారు. మరి ఈ రాశులు కలిగిన వారై ఉండి.. […]

Taurus Zodiac : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశుల చక్రం తో వ్యక్తుల జీవితాలు ముడిపడి ఉంటాయని ఆధ్యాత్మిక వాదుల భావన. కొన్ని రాశుల కలిగిన వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుందని.. వీరికి ధన లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి రాశుల్లో వృషభ, తుల రాశులు ఉన్నాయి. ఈ రాశులకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. దీంతో వీరి ఇంట్లో సంపద, విలాసం, భోగభాగ్యాలు ఉంటాయంటున్నారు. మరి ఈ రాశులు కలిగిన వారై ఉండి.. వారికి ఎలాంటి ధన ప్రాప్తి లేకపోతే ఏం చేయాలి?

వృషభ రాశి:
వృషభ రాశి వారు సహజంగా సంపదను కూడబెట్టే స్వభావం కలిగి ఉంటారు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వ్యవసాయం, వ్యాపారాలు, బ్యాంకింగ్ వంటి రంగాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన బాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరగడం..వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు, కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం కూడా ఏర్పడవచ్చు. అయితే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీటిని నియంత్రించుకుంటే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

తుల రాశి:
తుల రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాలు, కమ్యూనికేషన్ మీడియా, న్యాయ రంగాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనుకోని ధనలాభం లేదా పాత పెట్టుబడుల ద్వారా ప్రయోజనం కలిగే సూచనలు కూడా ఉండవచ్చు.వీరు ఉద్యోగ మార్పు, విదేశీ అవకాశాలను పొందుతారు. సామాజికంగా గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా ఆలోచించి వ్యవహరించడం మంచిది.

పై రెండు రాశుల స్వభావం ధన ప్రాప్తి అయినప్పటికీ కొందరు జన్మనక్షత్రం లేదా వారి జాతకం ప్రకారం ధనం పొందలేకపోతారు. ఇలాంటి వారు ప్రత్యేకమైన పరిహారం చేయాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు రాశుల వారు శుక్రవారం రోజున మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. తెల్లని పూలతో అర్చన చేయడం, లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల విజయాలు చేకూరుతాయి.అలాగే మహా శివుడికి ఆడవారు అయితే పాలతో, మగవారు అయితే తేనెతో అభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ రెండు రాశుల వారు ఆర్థిక లాభాలు వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తుంటారు. కొన్ని సార్లు అప్పుల ఊబిలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. హఠాత్తుగా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టుగా పొదుపు చేయడం చాలా అవసరం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper