Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కూడా కొంతమందికి మాత్రం మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు చేసే నటనలో గాని వాళ్లు ఎంచుకుంటున్న పాత్రల్లో గాని వైవిధ్యాన్ని చూపించిన ప్రతిసారి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న హీరోలు ఎంతమంది ఉన్నా కూడా మోహన్ బాబు లాంటి నటులు సైతం చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన కెరియర్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ టాప్ హీరో రేంజ్ ను టచ్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆయనకు మార్కెట్ అంతగా లేకపోవడంతో ఆయన సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వైవిద్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
రీసెంట్ గా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించిన ఆయన తొందరలోనే ప్యారడైజ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీనివాస మంగాపురం సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో మోహన్ బాబు క్యారెక్టర్ కి కూడా పెద్దగా గుర్తింపైతే రాలేదు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ ఇన్నింగ్స్ లో మోహన్ బాబు పెద్దగా తన సత్తా చూపించలేకపోతున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఇక శ్రీనివాస మంగాపురం సినిమాలో తన పాత్రకి రావల్సిన గుర్తింపు రాలేదు. కాబట్టి ప్యారడైజ్ సినిమాలో తను సోలో విలన్ గా నటిస్తున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు.
ఆ పాత్రని ఆయన ఎలా పోషిస్తాడు ఆ సినిమా ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటుంది అనే దాని మీదనే అతని సెకండ్ ఇన్నింగ్స్ ఆధారపడి ఉందని మరి కొంతమంది భావిస్తుండటం విశేషం…చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి పాత్రలను ఎంచుకుంటాడు, ఎలాంటి ఐడెంటిటి ని సంపాదించుకుంటాడు అనేది…