Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ను భారత నిలిపి వేసిందని ఉగ్రవాద దేశం అనుకుంది. కానీ అంతకుమించి అనే రేంజ్ లో భారత్ ఇప్పుడు స్పందిస్తోంది. భారత్ నుంచి ఈ స్థాయిలో స్పందన ఉంటుందని ఉగ్రవాద దేశం కనీసం కలలో కూడా ఊహించి ఉండదు. పాకిస్తాన్ నిద్ర నుంచి మేలుకోగానే.. భారత్ చేయాల్సిన పనిని చేపట్టింది. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. ఉగ్రవాద దేశం గట్టిగానే దాడి చేస్తుందని భావించిన భారత్.. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా నావికాదళం సముద్రంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఉగ్రవాద దేశంలోని కరాచీ నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ వంటి మిసైల్స్ తో కూడిన వార్ షిప్ లు, జలాంతర్గములను లైన్లో పెట్టింది. అంతేకాదు వాటిని పాకిస్తాన్ దిశగా మళ్ళించింది. కరాచీ పోర్ట్ టార్గెట్ గా 36 ఫ్రంట్లైన్ నావికా దళాలను భారత్ మోహరించిందంటే.. ఎంతటి గొప్ప లక్ష్యాన్ని అందుబాటులో ఉంచుకుందో అర్థం చేసుకోవచ్చు… 7 డిస్ట్రాయర్లు.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్.. హెవీ వెయిట్ టార్పెడో లను భారత్ అందుబాటులో ఉంచింది. వీటితోపాటు తుశిల్.. 7 స్టెల్త్ గైడెడ్ మిసైల్స్ . ఇతర యుద్ధ నౌకలను భారత్ మోహరింపజేసింది. తద్వారా కరాచీ నౌకాశ్రయాన్ని పూర్తిగా దిగ్బందించింది. భారత్ ఈ స్థాయిలో వస్తుందని ఉగ్రవాద దేశానికి ఏమాత్రం అంచనాలేదు. ఒకవేళ అంచనా ఉన్నప్పటికీ భారత్ కు దీటుగా స్పందించే సామర్థ్యం ఉగ్రవాద దేశానికి లేదు. దీంతో కమర్షియల్ షిప్ లు తమ రూటు మార్చేసుకున్నాయి. ఎందుకంటే కరాచీ నౌకాశ్రయంలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి…
Also Read: బలూచిస్తాన్.. ఇక స్వతంత్ర దేశం..
పాక్ నేలమట్టమైనట్టే
కరాచీ పోర్ట్ పై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ఆసియాలో పట్టు సాధించడానికి కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో పాకిస్తాన్ అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి.. కరాచీ పోర్టును సొంతం చేసుకుంది. పేరుకు అది పాకిస్తాన్లో ఉన్నప్పటికీ.. దానిమీద సర్వహక్కులు మొత్తం డ్రాగన్ దేశానికే ఉన్నాయి. అందువల్లే డ్రాగన్ దేశానికి చెక్ పెట్టడానికి.. ఉగ్రవాద దేశానికి చుక్కలు చూపించడానికి భారత ఏకంగా కరాచీ పోర్టును టార్గెట్ చేసింది. ఇప్పుడు ఉగ్రవాద దేశానికి డ్రాగన్ అండగా రాదు. ఒకవేళ వస్తే చైనా ఉగ్రవాద దేశంతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుందో బయటికి చెప్పాల్సి ఉంటుంది. అది ఒక రకంగా అమెరికాకు ఇబ్బంది కలిగిస్తుంది. వెంటనే అమెరికా లైన్ లోకి వస్తుంది. అప్పుడు డ్రాగన్ దేశానికి ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే భారత్ అత్యంత తెలివిగా పావులు కదిపింది. కరాచీ పోర్టు చుట్టూ ఉన్న తేనె తుట్టేను కదిపింది. పాపం ఇండియా రూపొందించిన ఈ ప్లాన్ అర్థం కాక పాకిస్తాన్ ఇప్పటికే బిక్క చచ్చిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమూలంగా నేల నాకడమే ఆ దేశం ముందు మిగిలింది.