Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ప్రతీ రోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. మొదటి మూడు రోజులకు సంబంధించిన అప్డేట్స్ ని ఇది వరకు చూశాము. మొన్న ఆదివారం కావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. నిన్న మళ్లీ షూటింగ్ కొనసాగింది. ఈ షూటింగ్ సంబంధించిన అప్డేట్స్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా జడ్జీలు తీసుకున్న అన్యాయపూరితమైన నిర్ణయాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో నేరుగా చివరి రౌండ్ కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ 3 కాగా , మిగిలిన వాళ్లందరికీ 1 గ్రీన్ ఫ్లాగ్ , రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టారు.
వీళ్ళు తదుపరి రౌండ్స్ లో టాస్కులు ఆడుతారు , బాగా ఆడిన వారిని చివరి రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు, ఇదే వాస్తవ ప్రక్రియ. కానీ వీరిలో 8 మందిని స్టేజి పైకి పిలిచి , మిమ్మల్ని సానబెట్టి, బిగ్ బాస్ షో కి తయారు చేసేంత సమయం మాకు లేదు అని చెప్పి నిర్దాక్షణంగా ఎలిమినేట్ చేసారట. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే , యాంకర్ శ్రీముఖి వాళ్లకు చాలా పొగరుగా సమాధానం చెప్పి , బయటకు పంపేసారట. ఇవన్నీ మనకి ఎపిసోడ్స్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ , చూపిస్తే మాత్రం ‘బిగ్ బాస్ 10’ పై జనాల్లో ఇప్పటి నుండే నెగెటివిటీ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు నిర్వహించి చివరి రౌండ్ కి సెలెక్ట్ చేశారట.
ఆ టాస్కులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఈ టాస్కులు కోసం కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టాశారు అనే చెప్పాలి. ఏమి చేయడానికైనా రెడీ అయిపోయారు. వీరి నుండి మరో నలుగురు చివరి రౌండ్ కి సెలెక్ట్ అయ్యారట. వాళ్ళు షాలిని పటేల్, శస్తీ వ్యాకరణం , నవరసాల మామ, భాగీ తుళ్లూరు అని సమాచారం. వీరిలో నవరసాల మామ , భాగీ తుళ్లూరు కి చాలా కఠినమైన టాస్కులు పెట్టారు. ‘నవరసాల మామ’ కి ‘తు నా బ్రతుకు’ అనే పచ్చ బొట్టు వేయించుకుంటే చివరి రౌండ్ కి సెలెక్ట్ చేస్తామని చెప్పారట, ఆయన క్షణం కూడా ఆలోచించకుండా పచ్చ బొట్టు వేయించుకొని చివరి రౌండ్ కి ఎంపికయ్యాడు. అదే విధంగా భాగీ తుళ్లూరు అనే అమ్మాయి అయితే డిప్ప కటింగ్ కొట్టించుకొని చివరి రౌండ్ కి ఎంపిక అయ్యిందట. ఇవన్నీ చూస్తుంటే జడ్జీలు చాలా ఓవర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.