Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోలు చేసిన సినిమాలు భారీ డిజాస్టర్లను కూడా మూట గట్టుకుంటూ ఉంటాయి.ఇప్పటి వరకు 1 కోటి రూపాయల నుంచి 70 కోట్ల వరకు నష్టాలను మిగిలిన సినిమాలు ఏంటి? అవి మిగిల్చిన నష్టాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.
Also Read : ఈ వారం ఓటీటీ లోకి ఏకంగా 11 సినిమాలు..ఆ రెండు సినిమాలు ఎంతో ప్రత్యేకం..ఆడియన్స్ కి పండగే!
చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆపద్బాంధవుడు’ సినిమా నాగార్జున హీరోగా వచ్చిన ‘అంతం’ సినిమా ఈ రెండు సినిమాలు కూడా కోటి రూపాయల నష్టాన్ని అయితే మిగిల్చాయి… ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘నిప్పురవ్వ’ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి వచ్చి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో 2 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది… చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ సినిమాకి మొదట్లో భారీ క్రేజ్ అయితే ఉండేది. ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్ అనే సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ కాంబినేషన్ కి భారీ ఐడెంటిటి అయితే ఏర్పడింది. అందువల్ల ఈ సినిమా మీద భారీ హైప్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా నాలుగు కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది… నాగార్జున హీరోగా మొదటి పాన్ ఇండియా సినిమా గా వచ్చిన ‘రక్షకుడు’ సినిమా 8 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మృగరాజు’ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే అప్పటికే బాలయ్య బాబు ‘నరసింహనాయుడు’ సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ గా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో చిరంజీవి సినిమా ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో ఉండటం వల్ల ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా ద్వారా చిరంజీవి దాదాపు 10 కోట్ల వరకు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది…పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడిగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరుపుకుంది. దాదాపు 17 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 10 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి… బాలయ్య బాబు హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 17 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది…
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా, 18 కోట్ల వరకు నష్టాన్ని చవి చూసింది. మొత్తానికైతే ఎన్టీఆర్ కెరియర్ లోనే అప్పటివరకు ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి…
బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘ఒక్క మగాడు’ సినిమా దాదాపు 17 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది… ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కొమరం పులి’ సినిమా 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అందులో 20 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి 22 కోట్ల వరకు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… ఇక ఖలేజా సినిమాతో మహేష్ బాబు దాదాపు 22 కోట్ల వరకు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. శక్తి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 36 కోట్ల నష్టాన్ని చవిచూశాడు.
మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘వన్’ సినిమా దాదాపు 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 30 కోట్ల కలెక్షన్లను రాబట్టి 40 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సైతం 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా కేవలం 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి 40 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చడం విశేషం… ‘ అజ్ఞాత వాసి’ సినిమా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా అందులో 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి 70 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
