Gautam Krishna Assets: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరిలో తను కూడా ఒకడిగా నిలిచిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన ఆయన తొందరలోనే ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అతనికి హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది హాలీవుడ్ దర్శకులు మహేష్ బాబుతో మంతనాలు జరుపుతున్నారనే వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ సైతం రెండు మూడు సంవత్సరాలలో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే యాక్టింగ్ కి సంబంధించిన మెళుకువలను నేర్చుకుంటున్న గౌతమ్ కృష్ణ తొందరలోనే మహేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశమైతే ఉంది. అయితే మహేష్ బాబు తండ్రి ఇచ్చిన ఆస్తితో పాటు మహేష్ బాబు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఆస్తులైతే సంపాదించుకున్నాడు.
తను ఒక సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా తన భార్య అయిన నమ్రత సైతం బిజినెస్ లను చూసుకుంటూ ఫ్యామిలీ ని సైతం బ్యాలెన్స్ గా లీడ్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ పేరు మీద కూడా చాలా వరకు ఆస్తులైతే ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి…
ప్రస్తుతం మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ పేరు మీద 100 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయట. ఇక మహేష్ బాబు సైతం గౌతమ్ కృష్ణ పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి గౌతమ్ కృష్ణ అకౌంట్ లో ఉన్న డబ్బులతోనే సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడట.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన నట వారసుడిగా గౌతమ్ కృష్ణను పరిచయం చేసి అతను కూడా సూపర్ స్టార్ రేంజ్ ను టచ్ చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తే మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే హీరో కూడా గౌతమ్ కృష్ణ నే అవుతాడనేది వాస్తవం…