Homeఅంతర్జాతీయంOperation Sindoor: భారత్‌ను టచ్‌ చేస్తే అట్లుంటది.. పాకిస్తాన్‌ లెక్క సరిచేసిన మోదీ!

Operation Sindoor: భారత్‌ను టచ్‌ చేస్తే అట్లుంటది.. పాకిస్తాన్‌ లెక్క సరిచేసిన మోదీ!

Operation Sindoor: పహల్గాం, పఠాన్‌కోట్, రియాసీ వంటి దాడులతో భారత్‌పై ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి సంస్థలు నడిపే శిక్షణ శిబిరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ శిబిరాలు ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు, సొరంగాల నెట్‌వర్క్‌ల ద్వారా భారత్‌లోకి చొరబాటు వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి.

బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌
జైషే మహ్మద్‌ కార్యాచరణ కేంద్రంగా పిలిచే ఈ శిబిరం సరిహద్దుకు 100 కి.మీ. దూరంలో ఉంది. పుల్వామా దాడి సహా అనేక కుట్రలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి. మసూద్‌ అజార్‌ ఈ కేంద్రాన్ని తన నివాసంగా కూడా ఉపయోగిస్తాడు. ముప్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్, మౌలానా అమర్‌ వంటి నాయకుల కుటుంబాలతో సహా 600 మంది ఉగ్రవాదుల నివాసాలు ఈ క్యాంపస్‌లో ఉన్నాయి. ఆత్మాహుతి దాడులకు శిక్షణ, ప్రణాళికలు ఇక్కడే జరుగుతాయి.
తెహ్రా కలాన్‌లోని సర్జల్‌ క్యాంప్‌
జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టర్‌కు ఆరు కి.మీ. దూరంలో ఉన్న ఈ శిబిరం సొరంగాల తవ్వకంలో కేంద్రంగా ఉంది. షకర్గర్‌ ప్రాంతంలో జైషే, లష్కరేలు సొరంగాల నెట్‌వర్క్‌ను విస్తరించాయి. మత్తు పదార్థాల రవాణా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమ్యూనికేషన్‌ సెంటర్లు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు పారాగ్లైడింగ్‌ శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ దాడికి ఇక్కడే ఉగ్రవాదులకు బ్రెయిన్‌వాష్‌ చేశారు.

Also Read: ఆపరేషన్ సిందూర్‌.. కల్నల్ సోఫియా ఖురేషి పాత్ర ఏంటి?

కోట్లిలోని మర్కజ్‌ అబ్బాస్‌
నియంత్రణ రేఖకు 35 కి.మీ. దూరంలో ఉన్న ఈ శిబిరం జైషే ఆయుధాగారంగా పనిచేస్తుంది. 125 మందికి శిక్షణ సౌకర్యాలతో, హఫీజ్‌ అబ్దుల్‌ షకూర్‌ నేతత్వంలో నడుస్తుంది. 2016 నగ్రోటా ఆర్మీ క్యాంప్‌ దాడి, 2023 పూంఛ్, రియాసీ దాడులకు ఈ కేంద్రం బాధ్యత వహించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇక్కడ నిల్వ చేస్తారు.

మురిద్కేలోని మర్కజ్‌ తోయిబా
సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో 82 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌ లష్కరే హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తుంది. మదర్సా, మార్కెట్‌లతో సహా 1000 మందికి శిక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ 2000లో 10 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. 26/11 ముంబై దాడిలో పాల్గొన్న అజ్మల్‌ కసబ్‌ ఇక్కడ శిక్షణ పొందాడు. హఫీజ్‌ సయీద్, జకీర్‌ రహ్మన్‌ లఖ్వీ వంటి నాయకులు ఇక్కడ నివసిస్తారు.

బర్నాలలోని మర్కజ్‌ అహ్లే హదిత్‌
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని భింబెర్‌ జిల్లాలో ఉన్న ఈ శిబిరం లష్కరే లాంచ్‌ప్యాడ్‌గా పనిచేస్తుంది. 150 మందికి శిక్షణ సౌకర్యాలతో, పూంఛ్, రాజౌరి, రియాసీ సెక్టార్లలోకి ఉగ్రవాదులను పంపిస్తుంది. ఖాసీం గుజ్జర్, అనాసీరార్‌ నేతత్వంలో నడుస్తుంది.

ముజఫరాబాద్‌లోని షవాయ్‌ నాలా క్యాంప్‌
2000 నుంచి ప.్ఛఠ్ఛిn్టట()నిచేస్తున్న ఈ శిబిరం లష్కరే కీలక కేంద్రం. 250 మందికి శిక్షణ సౌకర్యాలతో, జీపీఎస్, మ్యాప్‌ రీడింగ్, ఆయుధ వినియోగంపై శిక్షణ ఇస్తుంది. హఫీజ్‌ సయీద్‌ తరచూ ఇక్కడ కొత్త ఉగ్రవాదులను స్వాగతిస్తాడు. పాక్‌ ఐఎస్‌ఐ, సైన్యం ఈ కేంద్రానికి ఆయుధాలు సమకూరుస్తాయి.

సియల్‌కోట్‌లోని మెహ్మూనా జోయా క్యాంప్‌
సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో ఉన్న ఈ శిబిరం 50 మందికి శిక్షణ సౌకర్యాలను కలిగి ఉంది. మోహద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ నేతత్వంలో, 1995లో జమ్మూలో వరుస పేలుళ్లకు ఈ కేంద్రం బాధ్యత వహించింది. నివాస భవనాలతో చుట్టుముట్టబడిన ఈ శిబిరం దాడులకు ప్రణాళికలు రచిస్తుంది.

కోట్లిలోని మస్కర్‌ రహేల్‌ షహీద్‌
200 మందికి శిక్షణ సౌకర్యాలతో ఈ క్యాంపస్‌ పర్వత యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇస్తుంది. సయ్యద్‌ సలాహుద్దీన్‌ నేతత్వంలో, బోర్డర్‌ యాక్షన్‌ టీమ్, స్నైపింగ్‌ టెక్నిక్‌లు నేర్పిస్తారు. ఆయుధాలు, ప్రచార సామగ్రి పెద్ద ఎత్తున నిల్వ చేస్తారు.
ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్‌: జైషే రవాణా కేంద్రం
జైషే మహ్మద్‌ యొక్క మరో కీలక శిబిరం, ముఫీ అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ నేతత్వంలో నడుస్తుంది. పాక్‌ ఎస్‌ఎస్‌ఐ కమాండోలు ఇక్కడ శిక్షణ ఇస్తారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించేందుకు రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.

పాకిస్థాన్‌లోని ఈ శిక్షణ శిబిరాలు భారత్‌పై ఉగ్రవాద దాడులకు కేంద్ర బిందువులుగా పనిచేస్తున్నాయి. జైషే, లష్కరే, హిజ్బుల్‌ సంస్థలు ఈ కేంద్రాల ద్వారా శిక్షణ, ఆయుధాలు, సొరంగాల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తూ భారత భద్రతకు సవాల్‌ విసురుతున్నాయి. ఈ శిబిరాలను నిర్మూలించడం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అరికట్టడం సాధ్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular