DC Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాలుగా కష్టపడుతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ హీరోలు తమదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొంత మంది దర్శకులు సైతం హీరోలుగా మారి తమ టాలెంట్ ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కెప్టెన్ మిల్లర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజు హీరోగా ఒక సినిమా చేశాడు. డిసి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదట వేరే హీరోని అనుకున్నారట.
అయినప్పటికీ ఆ హీరో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో లోకేష్ కనకరాజు ను హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం మొదట అనుకున్న హీరో ఎవరు అంటే సందీప్ కిషన్ గా తెలుస్తుంది. సందీప్ కిషన్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు.
అరుణ్ మాదేశ్వరన్ కి సందీప్ కిషన్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ తోనే తనను ఈ సినిమా చేయమని అడిగితే ఆయనకి ఆ కథ అంత పెద్దగా నచ్చలేదని చెప్పారట. దాంతో హీరోగా ఏ ఇమేజ్ లేని ఒక ఫ్రెష్ ఫేస్ తో సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే లోకేష్ కనకరాజును హీరోగా మార్చి మొత్తానికైతే ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడుతుంది…
లోకేష్ కనకరాజు చేసిన మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… దర్శకుడు సైతం తన డైరెక్షన్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు… ఈ మూవీ ని చూసిన తరువాత లోకేష్ కనకరాజు కోసం కొంతమంది దర్శకులు సపరేట్ స్టోరీలను రాసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలైతే ఉన్నాయి…