Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందడంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపడంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. బుధవారం వేకువ జామున 1:44 గంటల సమయంలో భారత్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల సమయంలోనే ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను పూర్తి చేశాయి. అయితే ఈ దాడి తర్వాత యావత్తు ఇద్దరు కల్నల్ సోఫియా ఖురేషి ఈ ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్య పాత్ర పోషించింది. అసలు ఎవరీ ఈ కల్నల్ సోఫియా ఖురేషి? అని ఈమె గురించి తెలుసుకోవాలని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. మరి ఈమె ఎవరు? ఆపరేషన్ సిందూర్‌లో ఈమె ఎందుకు స్పెషల్ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: యుద్ధం సమయం: విమాన సర్వీసులు బంద్..
సోఫియా ఖురేషి గుజరాత్‌లోని వడోదరలో 1981లో జన్మించింది. ఖురేషి బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే వీరి కుటుంబంలో ఆర్మీలో ఉద్యోగం చేసే వారు ఉన్నారు. సోఫియా తాత కూడా గతంలో సైన్యంలో సేవలు అందించారు. ఆ తర్వాత తన తండ్రి కూడా కొన్నేళ్లు సైన్యంలో సేవలు అందించారు. ఇలా సోఫియా ఆర్మీలో చేరింది. 1999లో సోఫియా భారత సైన్యంలోకి చేరింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అప్పటి నుంచి శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అయితే ఆ తర్వాత సోఫియా 2006లో కాంగోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌లో ఒక సైనిక పరిశీలకురాలిగా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2010లో సోఫియా శాంతి పరిరక్షణ కార్యకలాపాలు ఎక్కువగా నిర్వహించేది. సోఫియా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంజాబ్ సరిహద్దులో ఆపరేషన్ పరాక్రమ్ జరిగింది. ఈ సమయంలో ఆమె చేసిన సేవలకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ నుంచి ప్రశంస పత్రం కూడా వచ్చింది. ఇలా ఆమె ఎన్నో చేసింది. ఆ తర్వాత వరద సహాయక చర్యల సమయంలో కృషి చేసింది. ఈమె చేసిన కృషికి గుర్తింపుగా సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుంచి మళ్లీ ప్రశంసలు అందుకుంది. అయితే ఖురేషి ఆఫీసర్ మేజర్ తాజుద్దీన్ ఖురేషిని వివాహం చేసుకోగా.. సమీర్ ఖురేషి అనే కుమారుడు ఉన్నాడు.
Also Read: ఆపరేషన్ సింధూర్.. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా కు భారత ఆర్మీ మాస్టర్ స్ట్రోక్!