Homeఎంటర్టైన్మెంట్Viswanath & Sons Trailer Review: 'విశ్వనాథ్ & సన్స్' ట్రైలర్ రివ్యూ : డైలాగ్స్...

Viswanath & Sons Trailer Review: ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ రివ్యూ : డైలాగ్స్ అదిరిపోయాయి.. కానీ అదొక్కటే మిస్ అయ్యింది..

Viswanath & Sons Trailer Review: ‘కరుప్పు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య హీరో గా నటించిన చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో , సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెన్నై లో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. త్వరలోనే తెలుగు వెర్షన్ […]

Viswanath & Sons Trailer Review: ‘కరుప్పు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య హీరో గా నటించిన చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం లో , సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెన్నై లో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. త్వరలోనే తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే టీజర్ , పాటలు వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

ఈ ట్రైలర్ ని చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ లాగా అనిపిస్తోంది. చెన్నై లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు అలా వైకుంఠపురం ఎలాగో , తమిళనాడు ప్రేక్షకులకు విశ్వనాధ్ & సన్స్ మూవీ అలాగా ‘ అంటూ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే ఆయన చెప్పిన మాటలు నిజం అయ్యేలాగానే అనిపిస్తోంది. కథ ఏమిటంటే హీరో విశ్వనాధ్ కి పెళ్లి అయ్యి ఉంటుంది. భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. అయితే పుట్టకతోనే ఆ బిడ్డకు ‘బోన్ మ్యారో’ సమస్య ఉంటుంది. దీనికి డోనర్ కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని , ఆమె నా స్నేహితురాలు , సాన్ ఫ్రాన్సికో లో ఉంటుంది అని చెప్తే , హీరో ఆమెని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. ఆమె ‘బోన్ మ్యారో’ దానం చేయడానికి ఒప్పుకుంటుంది , ఈ జర్నీ లో ఆమె హీరో ని ప్రేమిస్తుంది.

వయస్సు మళ్ళిన హీరో , యంగ్ వయస్సు లో ఉన్న హీరోయిన్ ప్రేమని అంగీకరించడు. ఆ తర్వాత చివరికి వాళ్లిద్దరూ ఎలా ఒక్కటి అయ్యారు అనేదే స్టోరీ అని ట్రైలర్ ని చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. ట్రైలర్ లో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి , అదే విధంగా సినిమా మొత్తం ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తోంది. ఈ ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే ఈ చిత్రం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా సంచలన విజయం సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సబ్జక్ట్స్ మాస్ సెంటర్స్ లో ఆడడం కష్టమే కాబట్టి , ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలాంటిది అనేది ఒక అంచనాకి రాలేకపోతున్నారు విశ్లేషకులు.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper