Homeఎంటర్టైన్మెంట్Bhagyashri Borse: ఏకంగా 800 కోట్లు.. బంపర్ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ భొర్సే..ఇది కదా లక్...

Bhagyashri Borse: ఏకంగా 800 కోట్లు.. బంపర్ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ భొర్సే..ఇది కదా లక్ అంటే..

Bhagyashri Borse: ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్స్ లో యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే . అందం పరంగా , నటన పరంగా ఈమె ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది. ఈమె ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ ‘బ్యూటీ + టాలెంట్’ ఉండడం తో అవకాశాలు నడుచుకుంటూ వచ్చాయి. […]

Bhagyashri Borse: ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్స్ లో యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే . అందం పరంగా , నటన పరంగా ఈమె ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది. ఈమె ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ ‘బ్యూటీ + టాలెంట్’ ఉండడం తో అవకాశాలు నడుచుకుంటూ వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘కింగ్డమ్’, ‘కాంత’ చిత్రాలు కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇక అందరూ ఈమెని ‘ఐరన్ లెగ్’ అని పిలుస్తున్న సమయంలో ‘లెనిన్’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో భాగ్యశ్రీ చాలా అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఈ హాట్ హీరోయిన్ స్పీడ్ కి బ్రేకులు పడలేదు , ఇక హిట్ వస్తే ఊరుకుంటుందా?, వరుసగా క్రేజీ ఆఫర్స్ తో ఆమె కాల్ షీట్స్ కళకళలాడిపోతున్నాయి. అక్టోబర్ 1 నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ‘బ్లడీ రోమియో’ చిత్రం లో భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా ఎంపికైంది అంటూ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. నాని -సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాకుండా ఈ చిత్రం తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ లో కూడా సుజిత్ ఆమెని హీరోయిన్ గా ఎంచుకున్నాడట. ‘బ్లడీ రోమియో’ చిత్రం హిట్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద 200 నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి.

ఇక ‘ఓజీ 2’ హిట్ అయితే లెక్క 500 కోట్ల గ్రాస్ నుండి మొదలు అవ్వుద్ది. అంటే ఆమె చేతిలో 800 కోట్ల రూపాయిల విలువ గల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ రెండు సినిమాలు హిట్ అయితే భాగ్యశ్రీ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. బాలీవుడ్ లో కూడా ఈమెకు వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తాయి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి భాగ్యశ్రీ రేంజ్ అంత దూరం వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక పీరియడ్ తమిళ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper