Suriya vs Vishal: ‘కరుప్పు’ గ్రాండ్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న సూర్య నుండి రాబోతున్న తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి , సాంగ్స్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడు తో పాటు , తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరిగింది. ఈమధ్య కాలం లో విడుదలైన సూర్య సినిమాలకు ఇలాంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడూ జరగలేదు. అలాంటి మంచి పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా విడుదలైన రోజున తమిళ హీరో విశాల్ నటించిన ‘మకుటం’ చిత్రం విడుదల కాబోతుంది. పీక్ ఫార్మ్ లో ఉన్న సూర్య బాక్స్ ఆఫీస్ మేనియా ని సవాల్ చేస్తూ , విశాల్ తన స్వీయ దర్శకత్వం లో చేసిన ‘మకుటం’ చిత్రాన్ని పోటీగా నిలబడడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. విశాల్ గత చిత్రం ‘రత్నం’ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి ముందు విడుదలైన రెండు చిత్రాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినప్పటికీ , విశాల్ కి ఎలాంటి పేరు ప్రేక్యతలు తెచ్చిపెట్టలేదు. పైగా ‘మకుటం’ చిత్రానికి హైప్ కూడా లేదు. ఈమధ్య కాలం లో హైప్ లేని సినిమాలకు సోలో విడుదల దొరికితేనే కలెక్షన్స్ రావడం లేదు , అలాంటిది ఇంత పెద్ద సినిమాకు పోటీగా దింపడం వెనుక విశాల్ స్ట్రాటజీ ఏంటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
అంత పెద్ద సినిమాకు పోటీ గా దిగితే , ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది , ఆడియన్స్ దృష్టిని ఆకర్షించవచ్చు అనే స్టాటజీ ని విశాల్ అనుసరించాడేమో అని కొందరు అనుకుంటూ ఉంటే , మరికొందరు మాత్రం ‘మకుటం’ కంటెంట్ పై విశాల్ కి గట్టి నమ్మకం ఉండడం వల్లే పోటీ కి దిగుతున్నాడని అంటున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రస్తుతం క్రేజ్ లేకపోవచ్చు , కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పైగా విశాల్ కి సౌత్ ఇండియా లో మంచి ఫేమ్ ఉందని , కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు అని నెటిజెన్స్ అంటున్నారు. మరి ఆగస్టు 14 న జరగబోయే ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరు గెలవబోతున్నారో చూడాలి.