Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందడంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపడంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. బుధవారం తెల్లవారు సమయంలో భారత్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల సమయంలోనే ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను పూర్తి చేశాయి. అయితే ఈ దాడి తర్వాత యావత్తు ఇద్దరు కల్నల్ సోఫియా ఖురేషితో పాటు కమాండర్ వోమికా సింగ్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్య పాత్ర పోషించిన కమాండర్ వోమికా సింగ్ ఎవరు? ఈమె స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
Also Read: ఆపరేషన్ సిందూర్.. కల్నల్ సోఫియా ఖురేషి పాత్ర ఏంటి?
ఆపరేషన్ సిందూర్‌లో కమాండర్ వ్యోమిక సింగ్ కూడా ఉన్నారు. వ్యోమిక సింగ్‌కు చిన్నప్పటి నుంచే వైమానిక దళంలో చేరాలని కోరిక ఉండేది. దీంతో ఆరో తరగతి నుంచే చేరాలని కలలు కనేవారు. ఈమె పేరులో కూడా ఆకాశం ఉంది. వోమిక అంటే ఆకాశంలో నివసించేదని అర్థం. అయితే వ్యోమిక సింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ 18న భారత వైమానిక దళంలో చేరారు. అయితే వోమిక కుటుంబంలో ఎవరూ కూడా సాయుధ దళాల్లో పనిచేయలేదు. సాయుధ దళాలలో పనిచేసిన మొదటి సభ్యురాలు కూడా వ్యోమికనే. అయితే వోమిక ఉద్యోగం వచ్చిన 13 ఏళ్ల తర్వాత సాయుధ దళాల్లో వింగ్ కమాండర్‌గా పదోన్నతి పొందారు. తన కెరీర్‌లో ఆమె ఎన్నో అత్యుత్తమ సేవలు చేశారు. నిబద్ధతకు వోమిక నిదర్శనమని చెప్పవచ్చు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో కఠిన ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడిపారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 22 వ తేదీన పహల్గాంలో టూరిస్ట్‌లను టార్గెట్ చేసి ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఈ ఉగ్రదాడుల్లో కొందరు మహిళలు వారి భర్తలను కోల్పోయారు. పెళ్లి అయి వారం కాకముందే నేవీ అధికారి మృతి చెందాడు. సరదాగా హనీమూన్‌కి వెళ్లి ఉగ్రవాదులకు బలి అయ్యాడు. పెళ్లి అయిన వారం రోజులకే భర్త చనిపోవడం అందరినీ కూడా కంటతడిపెట్టింది. ఈ సంఘటన యావత్తు భారత్‌ను కలచి వేసింది. దీంతో మోదీ ప్రభుత్వం పాక్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసి వారి స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 90 వరకు ఉగ్రవాదులు చనిపోయారు.