Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokeshm Arrest: గన్నవరంలో ఉద్రిక్తత.. నారా లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు

Nara Lokeshm Arrest: గన్నవరంలో ఉద్రిక్తత.. నారా లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు

Police Arrest Nara Lokesh At Gannavaram Airport

Nara Lokesh Arrest: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద దుమారం రేగింది. ప్రతిపక్ష నేతలను అక్రమంగా అడ్డుకుంటూ నిర్బంధంలో పెట్టడంపై మండిపడ్డారు. అనుమతుల పేరు చెప్పి అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారీ భద్రత మధ్య లోకేష్ ను విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. అనుమతుల పేరుతో ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని వాపోయారు.

లోకేష్ ఎంత మొత్తుకున్నా పోలీసులు మాత్రం వినలేదు. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నరసరావుపేట పర్యటనపై టెన్షన్ నెలకొంది. తెల్లవారు జాము నుంచే పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు టీడీపీ నేతలు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో నేతల మధ్య తోపులాట సైతం చోటుచేసుకుంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నరసరావుపేట పర్యటనకు వెళ్తున్న లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పరామర్శ కోసం వెళుతున్న ప్రతిపక్ష నేతను పోలీసులు నిబంధనల పేరుతో అడ్డుకోవడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి వెళ్లకున్నా తనను అడ్డుకుంటే అది ప్రభుత్వ తప్పిదమే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా నడుచుకుంటున్న వారిపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం ఏమిటని ప్రశ్నించారు.పోలీసులు ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకే లోకేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper