NRI Woman Complaint: ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు. ఎన్నారై మహిళ ఒకరు పెట్టిన పోస్టు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ మంత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నది ఆ మహిళ పెట్టిన పోస్ట్ సారాంశం. ఏకంగా మంత్రి నారా లోకేష్ కు ఆమె ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు మంత్రి? ఏంటా కథ? అన్నట్టు అందరూ ఆరా తీస్తున్నారు. అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు నడిపే ఓ మహిళ.. తన పట్ల ఏపీ మంత్రి అసభ్యంగా ప్రవర్తించారంటూ నేరుగా ఓపెన్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నారా లోకేష్ కు జత చేశారు. దీనిపై నారా లోకేష్ సైతం నేరుగా బాధితురాలతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.
* నాటా సమావేశాల సమయంలో..
నాటా సమావేశాల సమయంలో సదరు మంత్రి బాధిత మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నది ఆరోపణ. సదరు ఎన్నారై మహిళ విద్యార్థుల సంక్షేమం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక స్నేహితుడు ద్వారా పరిచయమైన సదరు మంత్రి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. అయితే నాటా సమావేశాలకు హాజరైన మంత్రులపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమకు చెందిన మంత్రి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే సదరు మహిళ మంత్రి పేరు బయట పెట్టలేదు. అయితే ఈ విషయమై బాధిత మహిళతో నారా లోకేష్ నేరుగా మాట్లాడినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పేరు లోకేష్ కు చెప్పారని.. ఇది ముగిసిన అధ్యయనం అని కూటమి వర్గాలు చెబుతున్నాయి. కానీ వైసీపీ అనుకూల మీడియాలో మాత్రం ఇది హైలెట్ అవుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి అనే దానిపై రకరకాల చర్చ నడుస్తోంది.
* ఎప్పటికప్పుడు అప్రమత్తం..
ఆది నుంచి కొందరు మంత్రుల విషయంలో అనేక రకాల వివాదాలు వినిపించాయి. అందుకే సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులకు కీలక ఆదేశాలు ఇస్తూ వచ్చారు. పనితీరు మెరుగుపరుచుకోవడం ఏ కాదు వ్యక్తిగత వ్యవహార శైలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి ఆరోపణలు రావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పుంజుకోవాలని వైసిపి చూస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశం దొరికిన జారవిడుచుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏపీ మంత్రి ప్రవర్తన పై వైసీపీ అధికారం మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో సైతం విస్తృతమవుతోంది ఆ ప్రచారం. ఇప్పటికే లోకేష్ కు ఈ విషయం తెలియడంతో.. తప్పకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లి ఉంటుంది. మున్ముందు సదరు మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.