spot_img
Homeజాతీయ వార్తలుఢిల్లీ గడ్డపై ఇక మోడీ పెత్తనం..: కేజ్రీవాల్ కు టెన్షన్..

ఢిల్లీ గడ్డపై ఇక మోడీ పెత్తనం..: కేజ్రీవాల్ కు టెన్షన్..

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరమవుతోంది. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రెండు పర్యాయాలు ఆప్ అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించింది. అయితే హోంశాఖ మాత్రం కేంద్రం ఆధీనంలో ఉండడంతో కొన్ని సార్లు బీజేపీ, ఆప్ ల  మధ్య వార్ సాగేది. అయితే ఇటీవల కేంద్రం ఢిల్లీని చేజిక్కించుకునే పని చేసింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మోడీ ఆ రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వ సవరణ చట్టం -2021 ప్రకారం మోడీకి ఢిల్లీ రాష్ట్రంపై పరోక్షంగా కొన్ని అధికారాలు రానున్నాయి. దీంతో ఇక్కడి సీఎం కేజ్రీవాల్ నామమాత్రంగానే పాలన సాగించనున్నారు.

ఢిల్లీకి రాష్ట్ర హోదా ఉన్నా కొన్ని ముఖ్యమైన అధికారాలు మాత్రం కేంద్రం చేతిలోనే ఉన్నాయి. భూమి సంబంధిత, పోలీసు శాఖలన్నీ కేంద్ర ప్రభుత్వంతోనే సాగేవి. అయితే కొత్తగా మరికొన్ని అధికారాలను కేంద్రం చేజిక్కించుకుంది. ప్రభుత్వ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా లాంటి శాఖలు ఇప్పుడు సెంట్రల్ పరిధిలోకి వెళ్లాయి. ఢిల్లీ సీఎం ఈ శాఖలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా మారింది.

ఢిల్లీపై ఆధిపత్యం చెలాయించడానికి మోడీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా సాధ్యం కాలేదు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సవరణ చట్టాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మోడీ పలు నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో మోడీ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని యత్నించాడు.అయితే అప్పుడు హైకోర్టు అడ్డుకుంది. అయితే ఇప్పుడు చట్టాన్నే మార్చడంతో మార్గం సుగమం అయింది.

తాజాగా సవరణ చేసిన చట్టం ప్రకారం ఢిల్లీకి రారాజు లెఫ్టినెంట్ గవర్నరే అని చెప్పాలి. అయితే ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో మోడీ పాగా వేయడానికి ఎన్నో ప్రయత్రాలు చేసి సఫలమయ్యారు. అయితే ఢిల్లీలో సాధ్యం కావడం లేదు. ఆప్ ప్రభుత్వం మోడీకి కంట్లో నలుసులాగా మారింది. దీంతో ప్రభుత్వ సవరణ చట్టం ద్వారా మోడీ అనుకున్నది సాధించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper