Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ 10' లోకి కంటెస్టెంట్ గా ప్రముఖ క్రికెటర్..పూర్తి...

Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ 10’ లోకి కంటెస్టెంట్ గా ప్రముఖ క్రికెటర్..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు..

Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ 10’ మొదలు అవ్వడానికి గడియలు దగ్గర పడుతున్నాయి. పట్టు మని నెల రోజులు కూడా లేకపోవడం తో ప్రేక్షకుల్లో ఈ షో పై ఉత్కంఠ రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ‘అగ్నిపరీక్ష 2’ కూడా ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. ఈ షో ద్వారా 6 నుండి 8 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసం 25 వేల అప్లికేషన్స్ నుండి […]

Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ 10’ మొదలు అవ్వడానికి గడియలు దగ్గర పడుతున్నాయి. పట్టు మని నెల రోజులు కూడా లేకపోవడం తో ప్రేక్షకుల్లో ఈ షో పై ఉత్కంఠ రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ‘అగ్నిపరీక్ష 2’ కూడా ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. ఈ షో ద్వారా 6 నుండి 8 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసం 25 వేల అప్లికేషన్స్ నుండి కేవలం 15 మందిని మాత్రమే అగ్నిపరీక్ష షో కి ఎంచుకున్నారు. నిన్న ఈ షో కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేయగా దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ షో లో పాల్గొనే కొంతమంది సెలబ్రిటీల జాబితా ని ఇది వరకే మనమంతా చూస్తూ వచ్చాము. జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ , పొట్టి నరేష్ , ఆదిత్య మీనన్ ,యాంకర్ వర్షిణి వంటి వారు నూటికి నూరు శాతం ఖరారు అయ్యారు.

ఇక మిగిలిన సెలబ్రిటీల జాబితా మనకు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది కానీ , వీళ్ళు ఇంకా అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు , కేవలం చర్చలు మాత్రమే జరిపారట. ఇదంతా పక్కన పెడితే ఈ షో లోకి కంటెస్టెంట్ గా ఒక ప్రముఖ క్రికెటర్ ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక గాసిప్ ప్రధానంగా వినిపిస్తోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు , అంబటి రాయుడు. ఇండియన్ క్రికెట్ టీం లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి , చిన్న వయస్సులోనే అన్ని ఫార్మాటులకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం లో పాల్గొన్నాడు. అంతకు ముందు ఆయన వైసీపీ పార్టీ లో చేరాడు. కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం తో జనసేన పార్టీ కి వచ్చారు.

పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అంబటి రాయుడు ఆ పార్టీ తరుపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు , ఎన్నికలు పూర్తి అయ్యాక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి అంబటి రాయుడు ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేశారట. మరి అంబటి రాయుడు ‘బిగ్ బాస్ 10’ లోకి రావడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆయన ఒప్పుకొని వస్తే మాత్రం టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అవుతాయి అనే చెప్పాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper