Lenin OTT: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి , అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అయినప్పటికీ అఖిల్ కి సరైన హిట్ లేకపోవడం తో , ఇక ఈయన సక్సెస్ ఎప్పటికీ కొట్టలేదు అని అభిమానులు సైతం బలంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయిన సమయం లో విడుదలైన ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం తో అక్కినేని ఫ్యాన్స్ లో ఆనందం కట్టలు తెంచుకుంది. మూవీ టీం ఈ చిత్రానికి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని అయితే విడుదల చేశారు కానీ , ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్స్ లో పెద్దగా గ్రాస్ వసూళ్లను రాబట్టకపోవడం వల్ల ఆ మార్కుని అందుకోలేకపోయింది.
ఇకపోతే థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 7 న జీ5 లో తెలుగు, తమిళం , హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఇక్కడ నుండి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వారం లో విడుదలైన సినిమాలను , వెబ్ సిరీస్ లను డామినేట్ చేస్తూ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న ఈ చిత్రానికి , కేవలం రెండు రోజుల్లోనే 100 మిల్లియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత ఈ ఏడాది జీ5 లో విడుదలైన సినిమాల్లో, అత్యధిక వ్యూయర్షిప్ ని సొంతం చేసుకున్న చిత్రం ఇదేనట. దీనిని బట్టీ అయ్యగారి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇన్నేళ్లు తన స్టామినా ని కూడా ఎలా వృధా చేసుకున్నాడో ‘లెనిన్’ మూవీ బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని బట్టే చెప్పొచ్చు.
ఇకపోతే అఖిల్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రశాంత్ నీల్ శిష్యుడితో అఖిల్ తదుపరి చిత్రం ఉంటుందని ఈమధ్య కాలం లో ఒక రూమర్ వచ్చింది. అంతే కాకుండా ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చి బాబు తో కూడా అఖిల్ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. వీటిలో ఏది నిజమైన అక్కినేని ఫ్యాన్స్ మరోసారి గర్వం గా కాలర్ ఎగరేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి అఖిల్ టార్గెట్ 100 కాదు , 200 కోట్ల గ్రాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.