Irummudi Trailer Review : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ నుండి ఎలాంటి సినిమాని కోరుకున్నామో , అలాంటి సినిమానే ఈసారి అందిస్తున్నాడు , బ్లాక్ బస్టర్ పక్కా అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ ట్రైలర్. మొదటి నుండి ఈ సినిమా పై ట్రేడ్ లో మంచి బజ్ ఉంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ఇప్పుడు డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు కాబట్టి. ఆ బజ్ ని రెట్టింపు చేసేలా ఉంది ఈ చిత్రం.
అయితే ఈ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి , ఇప్పుడు ‘ఇరుముడి’ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో , అదే ఫార్మటు తో దిగితే ఆడియన్స్ రొటీన్ ఫీల్ అవుతారేమో అనే భయం అభిమానుల్లో ఉండేది. కానీ స్టోరీ లైన్ ని సరికొత్తగా డిజైన్ చేసాడు డైరెక్టర్ శివ నిర్వాణ. సాధారణమైన ఆటో డ్రైవర్ గా తన భార్య , బిడ్డ తో చాలా సాధారణమైన మధ్యతరగతి జీవితాన్ని గడిపే హీరో కి ముందుకి బానిస. మందు కొట్టనిదే తన రోజు పూర్తి అవ్వదు. అలాంటి వ్యక్తి అయ్యప్ప మాల ధరించడం , నిష్ఠగా ఉండడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. అదే విధంగా తన ఊర్లో ఆడబిడ్డ పై ఎవరైనా చెయ్యి వేస్తే , వాళ్ళ అంతు చూసేంత వరకు నిద్రపోని మనస్తత్వం తో ఇందులో హీరో ఉన్నట్టుగా చూపించారు.
నాకు ఉన్నది ఒక్కటే బలహీనత, ప్రతీ ఆడబిడ్డలోనూ నా కూతుర్ని చూసుకోవడం , దాని జోలికి రాకు అంటూ రవితేజ తన మార్కు హీరోయిజం తో చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ చివర్లో ‘వీరాధి వీరుడు ఎక్కినాడు పల్లకి’ అనే ఫేమస్ పాటని , తనదైన శైలిలో రీమిక్స్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. అది పెద్దగా ఆకర్షించలేదు. ఉన్న పాటనే దించి ఉంటే చాలా బాగుండేది అని నెటిజెన్స్ అభిప్రాయం. ఓవరాల్ గా రవితేజ నుండి చాలా కాలం తర్వాత మంచి సినిమా రాబోతుంది అనే ఫీలింగ్ ని కలిగించింది ఈ ట్రైలర్. మరి మీకు కూడా అలాగే అనిపించిందా?, ట్రైలర్ ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేయండి.