Irummudi Movie : వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడుతోంది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న హీరోలందరూ ఈ ఏడాది తిరుగులేని కం బ్యాక్స్ ఇచ్చి ట్రేడ్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చేసింది. ఈయన కం బ్యాక్ కోసం అభిమానులు మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. జెన్ జీ ఆడియన్స్ కి రవితేజ విలువ తెలియకపోవచ్చు కానీ , చిన్నప్పటి నుండి అతను చేస్తున్న సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్లకు మాత్రం కచ్చితంగా తెలుసు. ఒకానొక సమయం లో టాలీవుడ్ నెంబర్ 1 హీరో రాజుకి కూడా ఆయన దగ్గరగా వచ్చాడు. అలాంటి రవితేజ ఈమధ్య కాలం లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ వస్తుండడం తో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా బాధ పడ్డారు.
అయితే ఈ నెల 21 న ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు. నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తున్నంత సేపు బ్లాక్ బస్టర్ కంటెంట్ ని చూస్తున్న ఫీలింగ్ అందరికీ కలిగింది. ముఖ్యంగా ‘ఇరుముడి’ నుండి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ లో రవితేజ తర్వాత బాగా హైలైట్ అయిన అమ్మాయి , ఆయనకు కూతురు పాత్ర పోషించిన నక్షత్ర. చూసేందుకు చాలా చలాకీగా కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా యాక్టింగ్ అదరగొట్టినట్టుగా అనిపిస్తోంది. పెద్దయ్యాక సినిమాల్లోకి ఈ చిన్నారికి వస్తుందో లేదో తెలియదు కానీ , వస్తే మాత్రం హీరోయిన్ గా సక్సెస్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ అమ్మాయి ముఖం లో ఆ ఫీచర్స్ ఉన్నాయి.
ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ? , ఇంతకు ముందు ఏ సినిమాలో చూడలేదే?, తొలిసినిమా అయినప్పటికీ చాలా చక్కగా నటిస్తోంది అని అంతా అనుకుంటున్నారు. సాధారణంగా నిర్మాత ముందుగా ఆడిషన్స్ ద్వారానే చైల్డ్ ఆర్టిస్టు ని ఎంచుకోవాలని అనుకున్నారట. కానీ డైరెక్టర్ శివ నిర్వాణ, తన స్నేహితుడి కూతుర్ని చూసిన తర్వాత , తన పాత్రకు ఈ చిన్నారి మాత్రమే న్యాయం చెయ్యగలదు అని బలంగా నమ్మి , తన స్నేహితుడిని ఒప్పించి ఈ సినిమాలో నటింపజేశాడట. ఈ చిన్నారి తల్లిదండ్రులకు సినీ ఇండస్ట్రీ తో ఎలాంటి సంబందం లేదట. ఈ చిత్రం తర్వాత ఈ చిన్నారి భవిష్యత్తు ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.