Homeజాతీయ వార్తలుRahul Gandhi: మోదీ వలలో చిక్కుకున్న కాంగ్రెస్‌.. సెల్ఫ్‌గోల్‌తో విలవిల!

Rahul Gandhi: మోదీ వలలో చిక్కుకున్న కాంగ్రెస్‌.. సెల్ఫ్‌గోల్‌తో విలవిల!

Rahul Gandhi: ఇటీవలి జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు ఒకానొక దశలో పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. నీట్‌ లీకేజీ, విద్యా విధాన మార్పులు వంటి అంశాల్లో ప్రభుత్వం వెనుకడుగు వేసేలా చేసింది. కాక్రోజ్‌ జనతాపార్టీలో కలిసి చేసిన ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మోదీ వెనుకడుగు వేసేలా చేసింది. అయితే, ఆ పైచేయిని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక అంశాలను ముందుకు తీసుకువచ్చి, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను […]

Rahul Gandhi: ఇటీవలి జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు ఒకానొక దశలో పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. నీట్‌ లీకేజీ, విద్యా విధాన మార్పులు వంటి అంశాల్లో ప్రభుత్వం వెనుకడుగు వేసేలా చేసింది. కాక్రోజ్‌ జనతాపార్టీలో కలిసి చేసిన ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మోదీ వెనుకడుగు వేసేలా చేసింది. అయితే, ఆ పైచేయిని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక అంశాలను ముందుకు తీసుకువచ్చి, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను సెల్ఫ్‌ గోల్‌లోకి నెట్టారు.

మోదీ పాలనలో వ్యూహాత్మక మార్పులు..
2014లో ‘అచ్చే దిన్‌’ నినాదంతో అధికారంలోకి వచ్చిన మోదీ, 2019లో పుల్వామా నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వ అవసరాన్ని నొక్కి చెప్పి 303 సీట్లు సాధించారు. 2024లో ‘అబ్‌కీ బార్‌ చార్‌సౌ’ పిలుపు ఉన్నప్పటికీ బీజేపీ 240 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్‌ 99 సీట్లతో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈ దశలో విపక్షాలు బలపడినట్లు కనిపించింది. అయితే తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్‌లో సత్తా చాటింది. ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. 2025 చివరి నుంచి కాంగ్రెస్‌ విమర్శలు పదునెక్కినప్పటికీ, మోదీ వద్ద స్పష్టమైన ఇష్యూ లేకపోవడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే ఆయన రెండు మాస్టర్‌ స్ట్రోక్స్‌ ప్రదర్శించారు.

‘దిమాగీ నక్సల్స్‌’ పదం..
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వాడిన ‘దిమాగీ నక్సల్స్‌’ పదం చర్చనీయాంశమైంది. దీనిని దేశ వ్యతిరేక శక్తులు, అభివృద్ధికి అడ్డుగా నిలిచేవారు అనే అర్థంలో వాడినట్లు అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికరంగా, మావోయిస్టు పార్టీలు, వామపక్షాలు, ఎస్సీ, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు స్పందించలేదు. కానీ కాంగ్రెస్‌ నేత చిదంబరం తొలుత స్పందించి, ఆ తర్వాత పార్టీ, దాని అనుబంధ సంస్థలు ఈ పదాన్ని తమకు అన్వయించుకున్నాయి. మోదీ ఒక్కసారి చెప్పిన పదాన్ని కాంగ్రెస్‌ తరచూ వాడుతూ, తమను తాము ఆ వర్గంలోకి చేర్చుకున్నట్లు చిత్రం ఏర్పడింది. ఇది విపక్షాల మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇతర పార్టీలు దూరం ఉండగా, కాంగ్రెస్‌ మాత్రం దానిని ఓన్‌ చేసుకోవడం రాజకీయంగా నష్టకరం.

వందేమాతరం పూర్తి గీతం..
ఇక రెండో అంశం వందేమాతరం పూర్తిగా పాడాలనే చట్టం. ముస్లిం పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. అన్ని పార్టీల నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 15న పాడకపోయినా లేచి నిలబడ్డారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్షాలు స్పందించలేదు. కానీ కాంగ్రెస్‌ వైపు నుంచి సోనియా గాంధీ వందేమాతరం పాడుతుంటే ఆపే ప్రయత్నం చేసిన వీడియో వైరల్‌ అయి విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు 1950లో నెహ్రూ తీర్మానం ప్రకారం వందేమాతరం పాడతామని కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. దీంతో నెహ్రూ జిన్నా కోసం రెండు చరణాలకు పరిమితం చేసిన చరిత్ర ఉంది. పూర్తి పాట రాకపోయినా, పాట వచ్చినప్పుడు లేచి నిలబడి గౌరవించడం సాధారణం. ఇందులో కూడా కాంగ్రెస్‌ నేతలు ఇష్టపడకపోవడం, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌కు అనుకూలం అనే ముద్రను బలపరిచింది. ముస్లిం ఓట్లకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, అస్సాం, బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడం మరో వైరుధ్యం.

ఈ రెండు అంశాలు కాంగ్రెస్‌ను సెల్స్‌ గోల్స్‌ కొట్టుకునేలా చేశాయి. మోదీ ప్రస్తావించినప్పుడు ఇతర పార్టీలు నిశ్శబ్దంగా ఉండగా, కాంగ్రెస్‌ మాత్రం ప్రతిస్పందించి, తన స్థానాన్ని బలహీనపరిచుకుంది. జాతీయవాదం, దేశభక్తి అంశాల్లో విపక్షాల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టమైంది. రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాలు కాంగ్రెస్‌ను నిరంతరం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పైచేయి సాధించిన దశలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం, మోదీ వలను గుర్తించలేకపోవడం ప్రధాన కారణం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper