YS Jagan:అవసరానికి తగ్గట్టుగా రాజకీయం.. ఎందుకంటే ఉన్న కేసులు అటువంటివి. వాటినుంచి రక్షణ పొందాలి. అసలే బెయిల్ మీద ఉన్న జీవితం.. ఇలాంటి అప్పుడు కేసులు వేలాడుతుంటే.. దర్యాప్తు సంస్థలు వెంటపడుతుంటే కాపాడుకోవడం కష్టం. అందువల్లే కేంద్రానికి జై కొట్టాలి. గడిచిన 12 సంవత్సరాలుగా జగన్ చేస్తున్నది ఇదే.
ఆస్తుల కేసులో జగన్ జైలు జీవితం
అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతరం అధికారంలో ఉన్న బిజెపి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బిజెపి ఆధ్వర్యంలో ఎటువంటి బిల్లు తీసుకొచ్చినా సరే దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. 2024లో చివరికి ఎన్డీఏ కూటమికి సైతం జగన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమిలో టిడిపి.. జనసేన ఉన్నప్పటికీ కూడా జగన్ తన ధోరణి మార్చుకోలేదు..
కాంగ్రెస్ పార్టీ పెద్దలతో దగ్గరగా ఉంటున్నట్టు ప్రచారం
ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెద్దలతో దగ్గరగా ఉంటున్నట్టు ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ తనకు మాత్రమే అలవాటైన రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. బెంగళూరులో ఇటీవల పరిమల్ నత్వాని అనే ఎంపీ తో భేటీ అయ్యారు. పరిమల్ నత్వాని మరెవరో కాదు.. రిలయన్స్ ప్రతిపాదించిన రాజ్యసభ అభ్యర్థి. అప్పట్లో రిలయన్స్ ఈ మాట చెప్పడమే ఆలస్యం జగన్ వెంటనే వైసీపీ నుంచి ఆయనను రాజ్య సభకు పంపించారు. ఇప్పుడు కూడా తన రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా పరిమల్ ను ఉపయోగించుకుంటున్నారు. తన కేసుల వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా రాకుండా ఉండేందుకు ఆయన పరిమల్ సహాయం కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అసలు రూపాన్ని చూపిస్తున్నారు.
ఒక వైపు తన కేసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూనే.. సోషల్ మీడియాలో తన అసలు రూపాన్ని చూపిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలు పారదర్శకంగా ఉండాలని ఏకంగా జగన్ ట్వీట్ చేశారు. వాస్తవానికి తాను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిన సరే జై కొట్టే అభిమానులు జగన్ కు చాలామంది ఉన్నారు. అయితే జగన్ ట్విట్ కు ఈసారి ఒక మహిళ ఎంపీ నుంచి దిమ్మతిరిగే రిప్లై వచ్చింది. ఒక రకంగా ఆ మహిళ ఎంపీ జగన్ కు తల అంటినంత పని చేసింది..” అన్ని విషయాలలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం ఆపండి. డి లిమిటేషన్ కు సపోర్ట్ చేయకుండా మీ ఎంపీలను ఆపండి. వ్యవస్థలను నాశనం చేసి ప్రజల దృష్టి మళ్ళించడానికి భావోద్వేగ రాజకీయాలను చేసే వారికి సపోర్ట్ చేయకండి అంటూ” తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రి వ్యాఖ్యానించింది..
మహువా సచ్చీల రాజకీయ నాయకురాలు కాదు
వాస్తవానికి మహువా కూడా సచ్చీల రాజకీయ నాయకురాలు కాదు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్న మహా ఘనాపాటి. ఈ ప్రకారం జగన్.. మహువా దొందు దొందే.. అని కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా జగన్ వ్యవహరించడని టిడిపి నేతలు అంటున్నారు. మహూవా ట్వీట్ చేసినంత మాత్రాన జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేదని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. కేసులు ఉన్నాయి కాబట్టి.. వాటి నుంచి రక్షణ పొందాలి కాబట్టి జగన్ కు తప్పదని.. ఇవీ జగన్ డబుల్ స్టాండర్డ్స్ అంటూ టిడిపి నేతలు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2026