HomeతెలంగాణRevanth Reddy: పేద‌ల దేవుడు శివుడు.. ధ‌నికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన...

Revanth Reddy: పేద‌ల దేవుడు శివుడు.. ధ‌నికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: మన దేశ రాజకీయాలలో మతం.. దేవుళ్ళు.. విశ్వాసాలు ముడిపడి ఉండడం కొత్త కాదు. ఆ రాజకీయపరటం ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఒకవైపు బిజెపి రాజకీయాలలో జైశ్రీరామ్ అనే నినాదాన్ని తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాముడి చుట్టూ ఏర్పడిన పొలిటికల్ నేరేటివ్ ను డెవలప్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ వైపు నుంచి హర హర మహాదేవ్ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. మరింతగా ఆజ్యం […]

Revanth Reddy: మన దేశ రాజకీయాలలో మతం.. దేవుళ్ళు.. విశ్వాసాలు ముడిపడి ఉండడం కొత్త కాదు. ఆ రాజకీయపరటం ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఒకవైపు బిజెపి రాజకీయాలలో జైశ్రీరామ్ అనే నినాదాన్ని తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాముడి చుట్టూ ఏర్పడిన పొలిటికల్ నేరేటివ్ ను డెవలప్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ వైపు నుంచి హర హర మహాదేవ్ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది.

మరింతగా ఆజ్యం పోశాయి

ఈ చర్చకు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింతగా ఆజ్యం పోశాయి. ఢిల్లీ నగరంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. శివుడిని పేదల దేవుడు అని కొనియాడారు. రాముడిని ధనికుల దేవుడు అని అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. బిజెపి జై శ్రీరాం అనే నినాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో హర హర మహాదేవ్ అనే నినాదాన్ని ఎందుకు చెప్పరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శివుడు.. రాముడు ఇద్దరూ తమ దేవుళ్ళని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ.. శివుడిని పేదల దేవుడిగా.. రాముడిని ధనికుల దేవుడిగా ఆయన చెప్పడం చర్చకు దారితీస్తోంది.

రేవంత్ చెప్పాలనుకున్నది అదేనా

రేవంత్ వ్యాఖ్యలను చూస్తే దేవుళ్ళపై చేసినట్టుగా మాత్రమే లేదు. రాజకీయ నేపథ్యంతో కూడి ఉన్న మాటలుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటల్లో బిజెపి రాజకీయ నినాదాలు కనిపించాయి. ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ సంస్కృతులు కనిపించాయి. సంపన్న వర్గాలతో బిజెపికి ఉన్న అనుబంధాన్ని ఆయన ఒక్కొక్కటిగా వివరించడం రాజకీయంగా సంచలనం కలిగించింది. ఒక వైపు బిజెపి జై శ్రీరామ్ అనే నినాదాన్ని తమ రాజకీయ ప్రతీకగా చూపిస్తోంది. కానీ ఈ విషయాన్ని పదేపదే రాజకీయ అంశంగా రేవంత్ ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం.

ధనికుల దేవుడు ఎలా అవుతాడు

రాముడిని రాజకుమానికి చెందిన దేవుడిగా మాత్రమే చూడటం వల్లే రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రామాయణంలో రాముడి జీవితంలో రాజులు.. రుషులు మాత్రమే కాదు.. గిరిజనులు.. సామాన్యులు.. వనవాసులు.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. శబరి.. గుహడు.. ఇలాంటివారు రాముడు జీవితంలో ఉన్నారు. రాముడు జీవితంలో సామాజిక హోదా కంటే భక్తి.. అనుబంధం.. ధర్మం అంటే అంశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కేవలం రాజకీయపరంగానే చూడాల్సి ఉంటుంది. మొత్తం రామాయణ సంప్రదాయాన్ని వివరించే సమగ్ర నిర్వచనం అసలు కాదు.

శివుడు పేదల దేవుడా

శివుడిది నిరాడంబరమైన రూపం. భస్మాన్ని ధరిస్తాడు. కైలాసంలో నివాసం ఉంటాడు. భూత గణాలతో అనుబంధాన్ని కొనసాగిస్తాడు. శివుడిని సామాన్యులకు దగ్గరగా చూపించే భక్తి సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. అందువల్లే శివుడిని సామాన్య దేవుడిగా రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారు. కానీ శివుడిని కేవలం పేదలకు మాత్రమే చెందిన దేవుడిగా చెప్పడం కూడా హిందూ తత్వంలోని విస్తృతమైన శివ స్వరూపాన్ని పరిమితం చేసినట్టు అవుతుంది.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణంలోనే కనిపిస్తున్నాయి. కానీ హరిహరుల మధ్య గీత గీసే స్థాయి ఆయనకు లేదు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రాముడిని ధనవంతులు మాత్రమే కొలవరు. శివుడిని పేదలు మాత్రమే పూజించరు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper