Homeవింతలు-విశేషాలుBride Doctor, Dr Shireen : పెళ్లి పీటల మీది నుంచి లేచి వచ్చి పెళ్లి...

Bride Doctor, Dr Shireen : పెళ్లి పీటల మీది నుంచి లేచి వచ్చి పెళ్లి కూతురు చేసిన పని వైరల్

Bride Doctor, Dr Shireen : సాధారణంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా వధూవరులను బయటకు వెళ్ళనివ్వరు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత మరుసటి రోజు వరకు వేరే కార్యక్రమంలో పాల్గొననివ్వరు. కానీ ఓ వధువు తన వివాహం జరుగుతుండగానే.. పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఓ పని చేసింది. ఏమి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ పెళ్లికూతురు ఏం పని చేసింది? అసలేం జరిగింది? కేరళలోని పనూర్ కు చెందిన డాక్టర్ షిరీన్ వైద్యురాలు. […]

Bride Doctor, Dr Shireen : సాధారణంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా వధూవరులను బయటకు వెళ్ళనివ్వరు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత మరుసటి రోజు వరకు వేరే కార్యక్రమంలో పాల్గొననివ్వరు. కానీ ఓ వధువు తన వివాహం జరుగుతుండగానే.. పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఓ పని చేసింది. ఏమి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ పెళ్లికూతురు ఏం పని చేసింది? అసలేం జరిగింది?

కేరళలోని పనూర్ కు చెందిన డాక్టర్ షిరీన్ వైద్యురాలు. ఆమెకు ఇటీవల డాక్టర్ రియాజ్ తో వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా వీరి పెళ్లి వేడుకకు బంధుమిత్రులు, స్నేహితులు అంతా హాజరయ్యారు. మరోవైపు వంట కార్యక్రమాల్లో క్యాటరింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఓవైపు పెళ్లి జరుగుతుండగా మరోవైపు వధువుకు క్యాటరింగ్ నుంచి ఒక సమాచారం అందింది.

క్యాటరింగ్ సెక్షన్ లోని ఇతరు యువతులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వీరి ముక్కు నుంచి రక్తస్రావం వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే స్నేహితులు లేదా బంధువులు వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ ఈ విషయం తెలిసిన వధువు షిరిన్ వెంటనే పెళ్లి వేడుక నుంచి హుటాహుటిన ఆ యువతుల వద్దకు వచ్చారు. వారికి ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. వీరికి కలిగిన అనారోగ్యంపై వధువు వెంటనే స్పందించి వైద్యం చేయడంతో వారి ప్రాణాపాయం తప్పినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఈ విధంగా ఒక పెళ్లికూతురు తన పెళ్లి వేడుక గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇతరుల ప్రాణాల విషయంలో శ్రద్ధ చూపడంపై తనకు కాబోయే భర్త ప్రత్యేకంగా ప్రశంసించాడు. అంతేకాక మిగతావారు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వైద్యులను మనుషులు దేవుళ్ళ లాగా భావిస్తారని అంటున్నారు. మరికొందరు వృత్తిపై అంకితభావం కలిగి ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు పెళ్లికూతురుగా బాధ్యతతో పాటు వైద్యురాలిగా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు అంటూ చెబుతున్నారు. ఆ తర్వాత డాక్టర్ల వివాహం ఘనంగా జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by News18.com (@cnnnews18)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper