Meena Actress: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో మీనా ఒకరు… అయితే ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోలందరితో సినిమాలను చేసింది. కానీ తనకు మాత్రం కంఫర్ట్ గా ఉన్న హీరో ఎవరు అంటే వెంకటేష్ అని చెబుతుంది… ఆమె కెరియర్ స్టార్టింగ్ లో వెంకటేష్ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని అతనితో ఎక్కువ సినిమాలు కూడా చేశానని అందువల్లే ఆయన అంటే రెస్పెక్ట్ పెరిగిందట… ఇక ప్రొఫెషనల్ గా కూడా తను మీనా ఉండాలి ఎలా యాక్టింగ్ చేయాలి అనేది కూడా వెంకటేష్ తనకు నేర్పించేవాడు అని మీనా చెప్పడం విశేషం… ఏది ఏమైనా కూడా మీనా వెంకటేష్ తో చంటి, సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయిగారు లాంటి సినిమాలను చేసింది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్ని కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం… వీరిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది…
మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకటేష్ పక్కన ‘దృశ్యం’ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది… బాలయ్య బాబు, చిరంజీవి, బాలయ్య లతో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికి ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు టాప్ హీరోలుగా ఉన్నారని వెంకటేష్ అయితే అప్పుడప్పుడు హీరోగా ఎదుగుతున్నాడు.
కాబట్టి తనతో తన ఫ్రెండ్ గా ఉండే దానినని కూడా చెప్పింది.
ఇక ఏదేమైనా కూడా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇప్పటికి సిద్ధంగా ఉన్నానని కూడా చెబుతుండడం విశేషం… ప్రస్తుతం ఆమె మలయాళం, తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో కొన్ని సినిమాలకు ఒప్పుకుంది.
దానికి తగ్గట్టుగానే ఆమె ఇప్పుడు రాణిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… కరోనా సమయంలో మీనా భర్త చనిపోయాడు. దాంతో ఆమె కొంతవరకు డీలా పడింది. కానీ మరోసారి సినిమాల్లో బిజీ అయి తన పర్సనల్ విషయాలను మర్చిపోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…