Homeజాతీయ వార్తలుIndian Army: పాక్ యుద్ధ సన్నాహాల వేళ.. బార్డర్ లో ఇండియన్ ఆర్మీ సంచలనం..వీడియో

Indian Army: పాక్ యుద్ధ సన్నాహాల వేళ.. బార్డర్ లో ఇండియన్ ఆర్మీ సంచలనం..వీడియో

Indian Army:  మన దాయాది దేశం పాకిస్తాన్..చైనా, టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. ఈ సమయంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. సరిహద్దులో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్–బార్మేర్ సెక్టార్‌లో భారత్‌మాల హైవేపై ఏహెచ్ – 64 అపాచీ, ఏఎల్ హెచ్ రుద్ర హెలికాప్టర్లతో ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బార్డర్లో బల ప్రదర్శన.. భారత్ పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దీటుగా […]

Indian Army:  మన దాయాది దేశం పాకిస్తాన్..చైనా, టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. ఈ సమయంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. సరిహద్దులో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్–బార్మేర్ సెక్టార్‌లో భారత్‌మాల హైవేపై ఏహెచ్ – 64 అపాచీ, ఏఎల్ హెచ్ రుద్ర హెలికాప్టర్లతో ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బార్డర్లో బల ప్రదర్శన..
భారత్ పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దీటుగా సరిహద్దు ప్రాంతంలో ఆధునిక హెలికాప్టర్ల బాల ప్రదర్శన చేసింది. జైసల్మేర్–బార్మేర్ సెక్టార్ భారత్–పాక్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ భారత్‌మాల హైవేను రన్‌వేలా మార్చి అపాచీ, రుద్ర హెలికాప్టర్లు ల్యాండ్ అయి, తిరిగి టేకాఫ్ అయ్యాయి. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ రన్‌వేలు దెబ్బతిన్నా, హైవేలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఇక అపాచీ హెలికాప్టర్లు అధునాతన దాడి సామర్థ్యం కలిగి ఉండగా, రుద్ర భారతీయ నిర్మిత గన్‌షిప్‌గా బహుళ పాత్రలు పోషించగలదు. ఈ డ్రిల్స్ సైనికుల శిక్షణను, సమన్వయాన్ని పెంచడమే కాకుండా, శత్రు దేశాలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి.

పాక్ సన్నాహాలతో అలర్ట్..
పాకిస్తాన్ చైనా, టర్కీ నుంచి ఆయుధాలు, డ్రోన్లు, ఇతర సామర్థ్యాలు పెంచుకుంటుంది. ఈ సందర్భంగా భారత్ ఈ డ్రిల్స్ నిర్వహించి సంచలనం సృష్టించింది. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం సంసిద్ధతను కాపాడుతోంది. హైవేలను రన్‌వేలుగా మార్చే సామర్థ్యం ఏర్పడటంతో వాయు శక్తిని వేగంగా, సురక్షితంగా మోహరించవచ్చు. ఇది యుద్ధ సమయంలో కీలకమైన వ్యూహాత్మక ఎత్తుగడ. న్యూ ఇండియా డిఫెన్స్ పవర్ ఇలాంటి ఆధునిక శిక్షణలు, మౌలిక సదుపాయాల వినియోగం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపిస్తోంది. సరిహద్దు భద్రతపై దృష్టి సారించి, శత్రు ఉద్దేశాలను వ్యూహాలను అర్థం చేసుకుని దేనికైనా సిద్ధం అన్న సంకేతం ఇచ్చింది.

వైరల్ వీడియోలపై ప్రశంసలు..
భారత సైన్యం నిర్వహించిన ఈ డ్రిల్స్ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు భారత సైన్యం సామర్థ్యాన్ని అభినందిస్తూ, దేశ రక్షణపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పాక్ సన్నాహాలు జరుగుతున్నా భారత్ సిద్ధం అనే సందేశం వీడియోల ద్వారా బలపడుతోంది. ఇలాంటి డ్రిల్స్ కేవలం ప్రదర్శన కాదు. భారత్ సరిహద్దులో తన శక్తిని నిరంతరం పెంచుకుంటూ, శాంతిని కాపాడుతూ సిద్ధంగా ఉందని ఈ డ్రిల్ స్పష్టం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper