Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGoogle Pixel offers : గూగుల్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ. 10వేల...

Google Pixel offers : గూగుల్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ. 10వేల క్యాష్ బ్యాక్..

Google Pixel offers :గూగుల్ సంస్థ అత్యంత శక్తివంతమైన ఏఐ ఫీచర్లతో కూడిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 11 సిరీస్ మొబైల్స్ పై తాజాగా ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ఫోన్ కొనేవారు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే దాదాపు రూ.10 వేల కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని మొబైల్స్ పై నో కాస్ట్ ఈఎంఐని ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితె.. గూగూల్ పిక్సెల్ 11 […]

Google Pixel offers :గూగుల్ సంస్థ అత్యంత శక్తివంతమైన ఏఐ ఫీచర్లతో కూడిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 11 సిరీస్ మొబైల్స్ పై తాజాగా ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ఫోన్ కొనేవారు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే దాదాపు రూ.10 వేల కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని మొబైల్స్ పై నో కాస్ట్ ఈఎంఐని ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితె..

గూగూల్ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.89,999తో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు ఫ్లాష్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.అలాగే రూ.9,000 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. 3 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం, క్రెడిట్ కార్డులపై 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. వీటిలో క్యాష్ బ్యాక్, ఎక్చేంజ్ ఆఫర్ ఆగస్టు 31 వరకు గడువును ప్రకటించారు. ప్రీమియం సర్వీస్ ట్రయల్ అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మొబైల్ లో 12 జీబీ ర్యామ్ ఉండడంతో వేగవంతమైన పనిని కోరుకునేవారికి బెస్ట్ గా నిలవనుంది.

అలాగే గూగుల్ పిక్సెల్ 11 ప్రో లేదా 11 ఫ్రో ఎక్సెల్ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు ఫ్లాష్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రూ.9,000 వరకు ఎక్చేంజ్ బోనస్ సదుపాయం ఉంది. ఇక 6 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో, యూట్యూబ్ ప్రీమియం ను అన్ లాక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు ఆగస్టు 31 వరకు వర్తిస్తాయి. ఇందులో అధునాతన కలిగిన కెమెరాను అమర్చారు. అలాగే ఏఐ టూల్స్ ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను సులభతరం చేస్తుంది.

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మొబైల్ పై కూడా రూ.10,000 వరకు తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఎక్చేంజ్ పై రూ.9,000 వరకు బోనస్ పొందే అవకాశం ఉంటుంది. 6 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో, మూడు నెలల పాటు యూ ట్యూబ్ ప్రీమియం అన్ లాక్ చేసుకునే సదుపాయం ఉంది. అద్భుతమైన డిస్ ప్లే తో పాటు నెట్ వర్క్ కనెక్టివిటీలో పరిమితులు లేకపోవడంతో ఈ ఫోన్ పై అంచనాలు ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper