Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబుపై దాడికి పోలీసులే కుట్రపన్నారా?

Chandrababu: చంద్రబాబుపై దాడికి పోలీసులే కుట్రపన్నారా?

Chandrababu: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులను బలి పశువులు చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో వైసిపి నాయకులు సేఫ్ గా తప్పించుకున్నారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున గాయాల పాలయ్యారు. దీనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి కారణమన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. వైసీపీ తరఫున ఎస్పీ వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండడమే అందుకు కారణం.

రాయలసీమలో ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అన్నిచోట్ల ఇవి సజావుగా సాగిపోతున్నాయి. చివరికి పులివెందులలో సైతం ప్రశాంతంగా ముగిసింది. వైసీపీ నేతలు రెచ్చగొట్టాలని, దాడులు చేయాలని భావించిన చోట మాత్రమే ఉద్రిక్తంగా మారుతోంది. పుంగనూరులో ఇదేవిధంగా మారింది. ఆ కుట్రలో పోలీసులు భాగస్వామ్యమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంగళ్లు నుంచి చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా లారీలు, బస్సులు, వజ్రవాహనాన్ని అడ్డంగా పెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. అయితే దీనిని ఎస్పీ రిశాంత్ రెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు. అంటే వాహనాలను అడ్డం పెడితే గొడవలు జరుగుతాయని పోలీసులకు ముందే తెలుసన్నమాట. ఇప్పుడు ఎస్పీ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

అంగళ్లు లో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో అతి చెరువలోకి వైసీపీ శ్రేణులు వచ్చి దాడులకు దిగాయి. అంటే ఒక విపక్ష నేత కార్యక్రమానికి విఘాతం కలిగేలా.. వైసీపీ కార్యకర్తలు రాగలిగారంటే అది ముమ్మాటికీ పోలీస్ వైఫల్యమే. ఈ దాడులను నియంత్రించలేని స్థితిలో పోలీసులు ఉండడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకొని మాత్రమే.. రాళ్లు వేస్తున్న వారిని తరమాలని టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే వైసీపీ శ్రేణులు తప్పించుకున్నాయి. పోలీసులు మాత్రం అడ్డంగా దొరికిపోయారు.

అయితే ఈ ఘటన తర్వాత ఎస్పీ మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉంది. ఇప్పటికే ఆయన వైసీపీ కోసం గుడ్డలు చించుకొని మరి పని చేస్తారన్న అపవాదు ఉంది. ఈ తరుణంలో ఆయన చేసిన ప్రకటన మరీ అభ్యంతరకరంగా ఉంది. అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాట్లాడిన అంశాలు చూస్తే.. పక్కా ప్లాన్ తోనే దాడులు జరిగాయని.. వైసీపీతో కలిసి పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ పై దాడులకు కుట్ర చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper