Balochistan Independence Day: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఆగస్టు 11న స్వాతంత్య్ర సంబరాలు జరిగాయి. బలూచ్ జెండాలు ఎగురవేసి ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచారు. స్వాతంత్య్ర గీతాలు ఆలపించార. కొన్ని ప్రాంతాల్లో భారతీయ జెండాలు కూడా కనిపించాయని, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, లిబరేషన్ ఫోర్స్ వంటి సమూహాలు ఊరేగింపులు చేశాయి. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని బలూచ్ వర్గాలు ‘బ్లాక్ డే’గా పరిగణించి నల్ల జెండాలు ఎగురవేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో 20 వేల నుంచి 30 వేల మందిరోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీశారు. ప్రజలు బలూచ్ స్వాతంత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
చారిత్రక నేపథ్యం…
1947లో బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో బలూచిస్తాన్ ప్రాంతంలో కలాత్, ఖరాన్, లస్‌బేలా, మక్రాన్ వంటి రాజ్యాలు ఉండేవి. వీటిలో కలాత్ పెద్దది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కలాత్ స్వాతంత్య్రం ప్రకటించినట్లు చారిత్రక రికార్డులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్య్రం పొందిన తర్వాత, ఇతర రాజ్యాలు విలీనమైనా కలాత్ విషయంలో వివాదం కొనసాగింది. 1948 మార్చిలో పాకిస్తాన్ సైన్యం చర్యల ద్వారా కలాత్‌ను విలీనం చేసుకుంది పాకిస్తాన్. బలవంతంగా రాజుతో విలీన పత్రాలపై సంతకం పెట్టించింది. అయితే ఖాన్ తమ్ముడు ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వంలో తొలి తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత 1950లు, 1960లు, 1970లు, 2000 తర్వాత కూడా అనేక దశల్లో తిరుగుబాట్లు, సాయుధ పోరాటాలు కొనసాగాయి. బలూచ్ జాతీయవాద సంస్థలు ఆగస్టు 11ను స్వాతంత్య్ర దినోత్సవంగా, ఆగస్టు 14ను నల్ల దినంగా పరిగణించడం ఈ చారిత్రక కోణం నుంచి వస్తోంది.
. దమనకాండ జరుగుతుండడంతో 2000 సంవత్సరం నుంచి బలూచ్ సంస్థలన్నీ కలిసి పాకిస్తాన్‌కు వ్యరితేకంగా పోరాడుతున్నాయి. 44 శాతం భూభాగం ఉన్న బలూచిస్తాన్‌లో ఆర్మీ గానీ, ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. బలూచిస్తాన్ దాదాపు స్వాతంత్య్రం అయింది. పాకిస్తాన్ పాలన లేదు.
2000 సంవత్సరం నుంచి వరుసగా..
బలూచిస్తాన్‌లో 2000 సంవత్సరం నుంచి నాలుగైదు సంస్థలు కలిసి పోరాటం మొదలు పెట్టాయి. ఐక్య పోరాటల ఫలితంగా ఇప్పటికి పాకిస్తాన్ బలూచిస్తాన్‌పై నియంత్రణ కోల్పోయింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున సంబురాలు జరుగుతున్నా ఏమీ తెలియనట్లు సైలెంట్‌గా ఉండిపోయింది. తమకు సంబంధం లేదు అన్నట్లు నటిస్తోంది.
మిగతా ప్రాంతాల్లో కూడా..
బలూచిస్తాన్‌తోపాటు పాకిస్తాన్‌లో 12 శాతం భూభాగం ఉన్న ఖెబర్‌ఫఖ్తూక్వాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ రెండు కలిస్తే సగం కన్నా ఎక్కువ భూమి పాకిస్తాన్ అధీనంలో లేదు. సిందులోనూ స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. పీవోకేలో కూడా నిరసనలు మిన్నంటుతున్నాయి. అక్కడ వతన్ నా కఫన్ అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యమాలను అణచివేయలేని బలహీన స్థితిలో పాకిస్తాన్ ఉంది. కేవలం పంజాబ్‌కు మాత్రమే పాకిస్తాన్ పరిమితమైంది. బలూచిస్తాన్‌లో జరుగుతున్న వేడుకలు రాబోయే రోజుల్లో పూర్తి స్వాతంత్రం సాదిస్తుందని నిరూపిస్తుంది.
ఆగస్టు 11 వేడుకలు బలూచ్ ప్రజల్లో నిరసన, గుర్తింపు కోరికను ప్రతిబింబిస్తాయి. చారిత్రక గాథలు, సాయుధ పోరాటాలు, హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అయితే, బలూచిస్తాన్ దాదాపు స్వతంత్రమైంది, పాకిస్తాన్ పాలన లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే బలూచిస్తాన్ పూర్తి స్వాతంత్య్రం పొందుతుంది.