HomeతెలంగాణRega Kantharao Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్..

Rega Kantharao Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్..

Rega Kantharao Arrest: ఉదయం లేస్తే జన్ జడ్ ఉద్యమం.. తెలంగాణ హక్కుల పరిరక్షణ.. ఇంకా రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో.. సొంత మీడియాలో గులాబీ పార్టీ నేతలు చేసే హడావిడి మాములుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీద.. రేవంత్ రెడ్డి మీద చేసే విమర్శలకు అడ్డు అదుపు ఉండదు. గురిగింజ తన కింది నలుపు ఎరగదు అన్నట్టుగా.. గులాబీ పార్టీ నేతల వ్యవహార శైలి ఉంటుంది. ఇటీవల కాలంలో గులాబీ పార్టీ నేతలు చేస్తున్న.. చేసిన […]

Rega Kantharao Arrest: ఉదయం లేస్తే జన్ జడ్ ఉద్యమం.. తెలంగాణ హక్కుల పరిరక్షణ.. ఇంకా రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో.. సొంత మీడియాలో గులాబీ పార్టీ నేతలు చేసే హడావిడి మాములుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీద.. రేవంత్ రెడ్డి మీద చేసే విమర్శలకు అడ్డు అదుపు ఉండదు. గురిగింజ తన కింది నలుపు ఎరగదు అన్నట్టుగా.. గులాబీ పార్టీ నేతల వ్యవహార శైలి ఉంటుంది.

ఇటీవల కాలంలో గులాబీ పార్టీ నేతలు చేస్తున్న.. చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అసలు వీళ్లా మనం ఎన్నుకున్న నేతలు.. మనం గొప్పగా చెప్పుకుంటున్న నాయకులు.. అని ప్రజలు ఆశ్చర్యపడే విధంగా ఉంటున్నది వారి తీరు. కనీసం తప్పుడు పనులు చేయకూడదు.. ప్రజల్లో చులకన కాకూడదు అనే ఇంగితాన్ని కూడా గులాబీ పార్టీ నాయకులు మర్చిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. తెలంగాణ మీద తమకు మాత్రమే పేటెంట్ రైట్ ఉంది అన్నట్టుగా.. ఏదైనా చేయొచ్చు.. ఎంతకైనా తెగించవచ్చు అనేటట్టుగా గులాబీ నేతలు వ్యవహరిస్తున్నారు..

తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. సహజంగానే ఈయనది దూకుడు తనం.. అప్పట్లో కాంగ్రెస్లో గెలిచినప్పటికీ.. గులాబీ పార్టీలో చేరారు. లాబీయింగ్ చేయడంలో.. లౌక్యాన్ని ప్రదర్శించడంలో ఈయన తర్వాత ఎవరైనా. అందువల్లే భద్రాద్రి జిల్లాకు అధ్యక్షుడు కాగలిగారు. పార్టీ విస్తరణకు గాని.. పట్టిష్టతకు గాని ఈయన చేసిన చర్యలు దాదాపు శూన్యం. జిల్లా అధ్యక్షుడిగా 2023 ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం భద్రాచలం నియోజకవర్గం లో మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. కాంతారావు కూడా పినపాక నియోజకవర్గం లో ఓటమిపాలయ్యారు. కాంతారావు ఓడిపోయినప్పటికీ తన చిలిపితనాన్ని.. తన కొంటెతనాన్ని వదులుకోలేదు.

ఓ యువతిని ఆయన లైంగికంగా వేధించారు. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు.. వీడియోలను అత్యంత రహస్యంగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు పేరుతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరితే.. ఎదురుదాడికి దిగారు. ఆ ఫోటోలను.. వీడియోలను బయటపెడతానని బెదిరించారు. దీంతో తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు ఆయన దగ్గరనుంచి కాంతారావు పరారీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి ఆయన బెంగళూరులో ఉండగా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. కాంతారావు అరెస్టును పోలీసులు ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కేసు నమోదు అయిన తర్వాత బెయిల్ కోసం కాంతారావు ప్రయత్నించినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆయన బెంగుళూరులో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper