Agnipariksha 2: సోషల్ మీడియా లో ‘బిగ్ బాస్ 10’ ఫీవర్ మొదలైంది. ఎక్కడ చూసినా ఈ సీజన్ కి సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతోంది. మొన్న జరిగిన షూటింగ్ లో జడ్జీలు చివరి రౌండ్ లో పాల్గొనే 15 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. అదే రోజున అన్యాయంగా 8 మంది కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్కులు నిర్వహించకుండా ఎలిమినేట్ చేశారు. ఇది ఈ షో పై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడేలా చేసింది. ఈ షో ఈ నెల 15 నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో ‘అగ్ని పరీక్ష 2’ టెలికాస్ట్ కానుంది. మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మొన్న విడుదల చేయగా, నిన్న రెండవ ప్రోమో ని విడుదల చేశారు.
ఈ ప్రోమో ఆరంభం సరదాగానే సాగింది. మితిలేష్ అనే వ్యక్తి జడ్జీలను విపరీతంగా అలరించాడు. నేను చాలా బోల్డ్ అంటూ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా పుషప్స్ చేయడం , అతను పుషప్స్ చేస్తున్నప్పుడు నవదీప్ ఏకంగా 40 కేజీల బరువు ని పెట్టడం వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మొదటి ప్రోమో చూపించిన ఒక అమ్మాయి ని నవదీప్ ‘ఖాళీ సమయం లో ఫోన్ లో ఎలాంటివి చూస్తుంటావ్?’ అని అడగ్గా , అందుకు ఆ అమ్మాయి ‘అందరూ చూసే వీడియోస్ చూస్తుంటాను’ అని అంటుంది గుర్తుందా?, ఈమెకు జడ్జీలు ఆ తర్వాత బూట్లు కడిగే టాస్క్ ఇవ్వగా, ఇది నన్ను అగౌరవపర్చినట్టు , నేను అసలు చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు జడ్జీలలో ఒకరైన అభిజీత్ స్టేజి మీదకు వచ్చి , ఆమె కాళ్ళు పట్టుకొని బూట్లు తుడుస్తూ ‘ఏ పని కూడా తక్కువ కాదు’ అని అంటాడు. అందుకు ఆ కంటెస్టెంట్ వెక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అభిజిత్ అలా చేయడం వల్లనో ఏమో తెలియదు కానీ , ఆ ప్రోమో లో ఆమె బురదతో నిండిన కొన్ని షూస్ ని తుడుస్తూ కనిపించింది. అయితే ఎలాంటి భేద భావాలు లేకుండా , ఒక టాప్ సెలబ్రిటీ కంటెస్టెంట్ అయ్యుండి కూడా, ముక్కు ముఖం తెలియని ఒక కంటెస్టెంట్ బూట్లను తుడిచినందుకు అభిజీత్ పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కొన్ని పనులను తక్కువ చేసి చూస్తూ , చులకన భావం తో ఉండే ప్రతీ ఒక్కరికి చెంప దెబ్బ లాంటిది అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.