Telugu Comedy Actors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసిన నటుడు బ్రహ్మానందం… ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ లో కూడా పేరు సంపాదించుకున్నాడు అంటే ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఒక్క సినిమాలో బ్రహ్మానందం కనిపించేవాడు. ఆయన లేకుండా సినిమాలు ఉండేవి కాదు. ఒకానొక సందర్భంలో స్టార్ హీరోల సినిమాలు సైతం బ్రహ్మానందం కామెడీ వల్లే హిట్ అవుతున్నాయనే పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయనకి ఏజ్ పెరిగిపోవడంతో ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక దాంతో బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ ప్లేస్ ను భర్తీ చేయగలిగే నటుడు ఎవరు అంటూ ఇండస్ట్రీలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా దానికోసం ఒక ఇద్దరు నటులైతే పోటీ పడుతున్నారు.
అందులో వెన్నెల కిషోర్ ఒకరు కాగా సత్య మరొకరు… వీళ్ళిద్దరిలో ఎవరు బ్రహ్మానందం ప్లేస్ ను భర్తీ చేయగలరు అనే ధోరణిలో మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే సత్య చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.
ఆయన డేట్స్ దొరకడం చాలా ఇబ్బందికరంగా మారింది. వెన్నెల కిషోర్ సైతం ప్రతి సినిమాలో నటిస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పిస్తు ముందుకు సాగుతున్నాడు… ఇక వీళ్ళిద్దరిలో ఎవరు బ్రహ్మానందం ప్లేస్ ని భర్తీ చేసేస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక రాబోయే సినిమాలతో ఎవరైతే ఆడియన్స్ లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తారో అలాగే ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటారో ఎవరైతే తన రేంజ్ కామెడీని పండిస్తూ నవ్వులు పూయిస్తారో వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో మరింత అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది… అలాగే బ్రహ్మానందం ప్లేస్ ని సైతం భర్తీ చేసే అవకాశాలైతే ఉంటాయి. చూడాలి మరి వీళ్లిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు అనేది…