Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: కొడాలి నాని తో పెట్టుకున్న ఎస్ఐకు ఊస్టింగ్!

Kodali Nani: కొడాలి నాని తో పెట్టుకున్న ఎస్ఐకు ఊస్టింగ్!

Kodali Nani: ఒకవైపు రాష్ట్రంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మహిళ పోలీసులపై అనుచిత ప్రవర్తన బయటపడుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో పోలీసులపై దాడుల సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ పై వి ఆర్ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2025 పై వైసీపీ దగాడిఎస్సి అంటూ ఆందోళనలు […]

Kodali Nani: ఒకవైపు రాష్ట్రంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మహిళ పోలీసులపై అనుచిత ప్రవర్తన బయటపడుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో పోలీసులపై దాడుల సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ పై వి ఆర్ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2025 పై వైసీపీ దగాడిఎస్సి అంటూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడే పోలీసులు అనుమతులు నిరాకరించిన వైసీపీ నేతలు లెక్కచేయడం లేదు. ఈ తరుణంలో గుడివాడలో ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు కొడాలి నాని కి. అయినా సరే ఆందోళనలు జరిపారు. దీంతో స్థానిక ఎస్సై ను వి ఆర్ కు పంపారు ఉన్నతాధికారులు.

* నోటీసులు ఇచ్చే క్రమంలో..
గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సత్యనారాయణ ఉన్నారు. డీఎస్సీ 2025 పై ఆందోళనలు నిర్వహించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడగా.. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కొడాలి నాని కి నోటీసులు ఇచ్చారు. అయితే వైసిపి శ్రేణులతో ఆందోళనలు జరపడమే కాదు ప్రభుత్వంపై విమర్శలు చేశారు కొడాలి నాని. ఈ తరుణంలో ఎస్సై సత్యనారాయణ కొడాలి నానితో చాలా చనువుగా ఉన్న వీడియోలతో పాటు ఫోటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నోటీసులు ఇచ్చే క్రమంలో కొడాలి నానితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు ఎస్ఐ సత్యనారాయణ. వెంటనే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో.. ఎస్సై సత్యనారాయణ ను వి ఆర్ కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

* ప్రభుత్వం సీరియస్..
కొడాలి నాని విషయంలో ప్రభుత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తోంది అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రస్తుత వ్యవస్థలో సైతం కొందరు అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. అదే పోలీస్ శాఖలో కొందరు సహకరించడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. త్వరలో కొడాలి నాని అరెస్ట్ కూడా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు అనుకూలమైన అధికారుల పై కూడా ఫోకస్ పెరిగింది. గుడివాడ ఎస్సై సత్యనారాయణ పై వి ఆర్ వేటు పడడం పోలీస్ శాఖలో చర్చకు దారితీస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper