Homeఆంధ్రప్రదేశ్‌జనసేన ఓటు బ్యాంకు తిరుపతిలో బీజేపీకి పడిందా?

జనసేన ఓటు బ్యాంకు తిరుపతిలో బీజేపీకి పడిందా?

Tirupati
ఎంతో హోరాహోరీ పోరు మధ్య తిరుపతి ఉప ఎన్నిక ముగిసింది. ఈ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని అన్ని పార్టీలూ చివరివరకూ ప్రయత్నాలు చేశాయి. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. అయితే.. ఈ ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో భారీ ఎత్తున మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ–జనసేనలపై ఆ ప్రభావం పడనుంది.

ఎవరు ఔనన్నా కాదన్నా ఏపీలో బీజేపీ–జనసేనలు మిత్రపక్షంగా ఉంటున్నాయి. ఇద్దరి మధ్య అండర్‌‌స్టాండింగ్‌తోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అలాగే తిరుపతి ఉప ఎన్నికలోనూ జనసేన బరిలోకి దిగకుండా బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను రంగంలోకి దింపారు. అయితే.. ఈ స్థానానికి జనసేన పోటీ చేయాలని ముందు నుంచీ అనుకున్నా.. కుదరలేదు. చివరకు పట్టుబట్టి మరీ బీజేపీనే తన మాట నెగ్గించుకుంది. పవన్‌ కల్యాణ్‌ను ఒప్పించి మరీ బరిలో నిలిచింది.

అయితే.. పవన్‌ కల్యాణ్‌ కూడా రత్నప్రభకు మద్దతుగా ఒక విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఒక తిరుపతి సభలోనే పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆద్యంతం వైసీపీనే టార్గెట్‌ చేశారు. ఎక్కడా చంద్రబాబు ఊసెత్తలేదు.

ఈ క్రమంలో జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి పడిందా లేదా అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోందట. వీరి పొత్తులో భాగంగా జరుగుతున్న అతి పెద్ద ఎన్నిక కూడా ఇదే. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్’ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా గల్లతైంది. వేరే అభ్యర్థికి దీన్ని కేటాయించారు. బీజేపీ కమలం గుర్తు మీదనే ఇక్కడ బీజేపీ-జనసేన పోటీపడ్డాయి.   నిజానికి తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ బలం ఉందన్న టాక్ ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్లతోపాటు పవన్‌ అభిమానులు, బలిజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో జనసేన కార్యకర్తలు పెద్దగా ఎక్కడా పాల్గొనలేదనే టాక్‌ ఉంది. దీంతో జనసేన ఓట్లు కూటమి అభ్యర్థికి పడ్డాయా..? లేదా..? అనేది ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికైతే పోరు ముగిసింది. రిజల్ట్‌ వస్తే కానీ అసలు విషయం తెలియదు. మొత్తంగా బీజేపీ, జనసేనల రాజకీయ భవితవ్యం మాత్రం ఓ రిజల్ట్‌ మీదనే ఆధారపడి ఉన్నట్లుగా అర్థమవుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper