
హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఛాన్స్ ల కోసం దర్శకుల చుట్టూ తిరిగినా అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా అమెకు మైనస్ అవుతున్నాయి తప్పితే.. ఆమె కెరీర్ కే ఏ మాత్రం ఉపయోగపడట్లేదు. మరి, ఇలాంటి స్థితిలో ఏ హీరోయిన్ అయినా.. కాస్త కెరీర్ పై ఏకాగ్రత పెడుతుంది. కానీ, పాయల్ మాత్రం ఎలాగూ ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. ఇక దేనికి భయపడాల్సిన పని లేదు అని బాయ్ ఫ్రెండ్ ను కూడా పబ్లిక్ చేసేసింది. అతగాడు కూడా పాయల్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాడు.
మొత్తానికి బాయ్ ఫ్రెండ్ తోనే పాయల్ సెట్ కి రావడం, అన్ని విషయాల్లో ఆమె బాయ్ ఫ్రెండ్ తలదూర్చడం వంటి అంశాలు ఆమె పై నెగిటివిటీని పెంచుతున్నాయి. పైగా తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పాయల్, నిర్మాతలను కోరుతుంది. ఇది అసలకే మోసం వచ్చేలా ఉంది. అయినా తెలుగు నిర్మాతలు ఇలాంటి విషయాలను అసలు సహించరు. కోట్లు నష్టపోతున్నా భరిస్తారు గానీ, ఒక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కోసం వేలు ఖర్చు పెట్టించినా అది వారి దృష్టిలో పెద్ద అపరాధం. అందుకే పాయల్ ఈ విషయంలో పెద్ద తప్పే చేసింది.
అందుకే ఆమెను చాలామంది నిర్మాతలు పక్కన పెట్టారట. మరోపక్క పాయల్ మాత్రం సోషల్ మీడియా వేదిక పై హాట్ హాట్ ఫోటోషూట్లు చేసి షేర్ చేస్తూ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అయినా తెలుగు బడా ప్రొడక్షన్ హౌస్ లన్నీ ఆమెను అవాయిడ్ చేస్తున్నాయి. దాంతో పాయల్ కూడా తెలుగులో ఇక పెద్దగా ఛాన్సులు రావని ఫిక్స్ అయినట్టు ఉంది. దాంతో, ఇప్పుడు ఇతర భాషల వైపు చూపు వేసింది. పంజాబీలో నిన్న ఒక కొత్త సినిమా స్టార్ట్ చేసింది.
పంజాబీ హీరో గిప్పి గ్రేవాల్ సరసన ఆమె నటిస్తోంది. ‘నా ఆల్ టైం ఫేవరైట్ హీరోతో మొదటిసారి కలిసి నటిస్తున్నా,” అంటూ సోషల్ మీడియాలో సగర్వంగా ప్రకటించుకుంది.