Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'అగ్ని పరీక్ష ' షో ని శాశ్వతంగా ఆపేయనున్న 'బిగ్...

Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష ‘ షో ని శాశ్వతంగా ఆపేయనున్న ‘బిగ్ బాస్’ టీం.. కారణాలు ఏంటంటే!

Bigg Boss 10 Telugu: సామాన్యులకు కూడా బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ‘అగ్ని పరీక్ష’ షో ని త్వరలోనే ఆపేయబోతున్నారా?. కన్నడ బిగ్ బాస్ లో కూడా హోస్ట్ సుదీప్ పబ్లిక్ గా స్టేజి మీద అగ్ని పరీక్ష షో ని ఆపేయాలి అని అంటాడు. ఎందుకంటే సామాన్యులు సెలబ్రిటీలపై నోటి దూలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం , యాటిట్యూడ్ తో ప్రవర్తించడం వంటివి కన్నడ బిగ్ బాస్ […]

Bigg Boss 10 Telugu: సామాన్యులకు కూడా బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ‘అగ్ని పరీక్ష’ షో ని త్వరలోనే ఆపేయబోతున్నారా?. కన్నడ బిగ్ బాస్ లో కూడా హోస్ట్ సుదీప్ పబ్లిక్ గా స్టేజి మీద అగ్ని పరీక్ష షో ని ఆపేయాలి అని అంటాడు. ఎందుకంటే సామాన్యులు సెలబ్రిటీలపై నోటి దూలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం , యాటిట్యూడ్ తో ప్రవర్తించడం వంటివి కన్నడ బిగ్ బాస్ షో లో చేశారు కాబట్టి. గత సీజన్ లో మన తెలుగు లో కూడా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ సెలబ్రిటీలతో మొదటి నాలుగు వారాలు ఇలాగే ప్రవర్తించారు. కానీ ఆ తర్వాత నెగెటివిటీ ని గమనించి వాళ్ళ ప్రవర్తన ని మార్చుకున్నారు. ఇక ఈ సీజన్ లోని ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో డైమండ్స్ లాగా ప్రవర్తిస్తున్నారు.

నీతి నిజాయితీ తో గేమ్ ఆడడం, స్నేహానికి విలువ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే వీళ్ళని చాలా చులకన చేయడం , ఒక్కొక్కరిని సద్యమానినంత తొందరగా బిగ్ బాస్ నుండి బయటకు పంపేలా స్కెచ్ లు వేయడం వంటివి చేస్తున్నారు. ఈ కారణం చేత తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత సీజన్ కళ్యాణ్ పడాల ఎలా అయితే అడుతంగా గేమ్స్ ఆడి టైటిల్ విన్నర్ గా నిలిచాడో, ఈ సీజన్ లో మరో సామాన్యుడు రోహిత్ నాయుడు కూడా అదే రేంజ్ టైటిల్ విన్నింగ్ దిశగా అడుగులు వేస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే రోహిత్ ‘అగ్ని పరీక్ష 2’ లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ లో పావు శాతం కూడా ఇప్పటి వరకు ‘బిగ్ బాస్ 10’ లో ఇవ్వలేదు. అయినప్పటికీ ‘అగ్ని పరీక్ష 2’ సమయం లో ఏర్పడిన క్రేజ్ , ఫాలోయింగ్ కారణంగా అతని ఓటింగ్ కి దరిదాపుల్లో మరో కంటెస్టెంట్ లేడు.

ఇది రోహిత్ ఓటింగ్ ని దాటాలంటే, త్రిగున్, ముకేశ్ వంటి కంటెస్టెంట్స్ వరుసగా నాలుగు వారాలు వేరే లెవెల్ గేమ్ ని ఆడాలి. ఈ వారం కచ్చితంగా రోహిత్ కి బాగా నెగెటివ్ అయ్యింది, త్రిగున్, ముకేష్ లకు బాగా కలిసొచ్చింది. కానీ రోహిత్ ఓటింగ్ శాతం కూడా తగ్గలేదు. నిన్నటి ఎపిసోడ్ తో రోహిత్ పై మరింత సానుభూతి పెరిగింది , గ్రాఫ్ ఎక్కడికో వెళ్లి కూర్చుంది. రాబోయే వారాల్లో రోహిత్ కి సరైన ఎపిసోడ్స్ రెండు పడితే , ఇక అతన్ని అందుకోవడం అనేది కలనే అనుకోవచ్చు. రోహిత్ ఈ స్థాయిలో జనాల్లోకి వెళ్లిపోవడానికి కారణం ‘అగ్ని పరీక్ష 2’ షో నే. కేవలం 20 రోజుల షో తో సామాన్యులకు ఈ రేంజ్ క్రేజ్ వచ్చేస్తోంది , వాళ్ళ ఓటు బ్యాంక్ ని మ్యాచ్ చేయడం సెలబ్రిటీల వల్ల అవ్వడం లేదు.

రాబోయే సీజన్ లో సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే , సెలబ్రిటీలు మొహమాటం లేకుండా మేము రాము అనే పరిస్థితి ఉంటుంది. ఈ సీజన్ కి కూడా అదే జరిగిందట. కానీ చివరి నిమిషం లో సెలబ్రిటీలు ఈ షో లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు రోహిత్ నాయుడు ఒక వేల టైటిల్ గెలిస్తే తదుపరి సీజన్స్ లో సెలబ్రిటీలు రావడానికి భయపడతారు. అందుకే ప్రతీ వీకెండ్ లో నాగార్జున హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్స్ తప్పులు చేసినా , కేవలం రోహిత్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ , అతని గ్రాఫ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోహిత్ ని ఎంత తొక్కాలని చూస్తే, అంత పైకి లేస్తున్నాడు. కేవలం నాలుగు వారాల్లోనే విన్నర్ డిసైడ్ అయిపోయిందని , ఇక ఈ షో లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి మనం చేసేది ఏమి లేదనే అభిప్రాయం పలు సెలబ్రిటీస్ లో ఏర్పడింది అట.

ఇప్పుడే ఇలా ఉంటే , వచ్చే సీజన్ లో ‘అగ్ని పరీక్ష’ కంటెస్టెంట్స్ ని చూసి , ఒక్క సెలబ్రిటీ కూడా బిగ్ బాస్ షో లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించరు అనే విషయాన్ని అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం, ఈ ‘అగ్ని పరీక్ష’ కాన్సెప్ట్ నే ఎత్తేయాలని చూస్తున్నట్టు లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ‘అగ్ని పరీక్ష ‘ షో ముందు సీజన్స్ కొనసాగాలా వద్దా?, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper