Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: ముకేష్ కాళ్ళు పట్టుకున్న వర్షిణి.. ఇదేమి రోత బాబోయ్!

Bigg Boss 10 Telugu: ముకేష్ కాళ్ళు పట్టుకున్న వర్షిణి.. ఇదేమి రోత బాబోయ్!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ముకేశ్ , వర్షిణి మధ్య జరుగుతున్న లవ్ ట్రాక్ ఎలాంటిదో మనం మొదటి వారం నుండి గమనిస్తూనే ఉన్నాం. ఏ లవ్ ట్రాక్ అయినా ఆర్గానిక్ గా ఉంటే చూసేందుకు చాలా బాగుంటుంది, కానీ ఈ లవ్ ట్రాక్ మాత్రం కేవలం కంటెంట్ కోసమే నడుపుతున్నట్టుగా అనిపిస్తోంది. కంటెంట్ కోసం నడిపితే పర్వాలేదు, కానీ వీళ్లిద్దరు కలిసి పక్క వాళ్ళని తొక్కే గేమ్ […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ముకేశ్ , వర్షిణి మధ్య జరుగుతున్న లవ్ ట్రాక్ ఎలాంటిదో మనం మొదటి వారం నుండి గమనిస్తూనే ఉన్నాం. ఏ లవ్ ట్రాక్ అయినా ఆర్గానిక్ గా ఉంటే చూసేందుకు చాలా బాగుంటుంది, కానీ ఈ లవ్ ట్రాక్ మాత్రం కేవలం కంటెంట్ కోసమే నడుపుతున్నట్టుగా అనిపిస్తోంది. కంటెంట్ కోసం నడిపితే పర్వాలేదు, కానీ వీళ్లిద్దరు కలిసి పక్క వాళ్ళని తొక్కే గేమ్ ఆడుతున్నారు. ఇది ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ చూసిన తర్వాత అయితే ఆడియన్స్ కి వేరే లెవెల్ చిరాకు కలిగిందని చెప్పొచ్చు. తన వద్ద ఉన్నటువంటి మ్యాజికల్ పవర్ ని ఉపయోగించి వర్షిణి అమన్ గెలిచిన కెప్టెన్సీ ని తన కైవసం చేసుకుంది.

మరో వైపు ముకేశ్ రోహిత్ ని కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి పీకేయడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. మొత్తానికి తాను అనుకున్న టాస్క్ ని విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసాడు ముకేశ్. తనకు కెప్టెన్సీ దక్కేలా చేయడం లో ముకేశ్ కీలక పాత్ర పోషించాడు అనే ఫీలింగ్ వర్షిణి లో రావడం వల్ల , ఆమె నిన్న వాష్ రూమ్ లో ముకేశ్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అలా ముకేశ్ కాళ్ళు మొక్కడం వెనుక అర్థం ఏంటి?, సాధారణంగా ఒక అమ్మాయి , అబ్బాయి కాళ్ళు పట్టుకోవడం అనేది భర్త విషయం లోనే జరుగుతుంది. అంటే వర్షిణి ముకేశ్ ని భర్త స్థానం లో ఉంచిందా?, అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూసేందుకు ఈ సన్నివేశం చాలా క్రింజ్ గా ఉందని , ఇలాంటి రోత ని కొనసాగిస్తే ముకేశ్ టైటిల్ విన్నర్ రేస్ లో కాదు కదా , కనీసం టాప్ 5 లో కూడా ఉండదని అంటున్నారు విశ్లేషకులు.

చాలా మంది త్రిగున్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నడని అనుకుంటున్నారు కానీ , అసలు సిసలైన కన్నింగ్ గేమ్ ఆడుతున్నది ముకేశ్ అని, ఇది ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదని అంటున్నారు. వర్షిణి చేసిన మరో భారీ మిస్టేక్ ఏంటంటే, ఆమె తన మ్యాజికల్ పవర్ గురించి త్రిగున్ కి చెప్పడం. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఒకరి పవర్ గురించి ఒకరు చెప్పుకోకూడదు. ఈ రూల్ ని వర్షిణి అతిక్రమించినప్పటికీ కూడా బిగ్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ వీకెండ్ లో నాగార్జున అయినా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వర్షిణి కెప్టెన్సీ ని రద్దు చేసి , అమన్ కి తిరిగి ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper