Homeఎంటర్టైన్మెంట్Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే

Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే

Telugu Cinema: తెలుగు సినిమాను చంపేస్తున్నది ఎవరు.. పైరసీనా.. కథలేని దర్శకులా.. నిర్మాతల నేల నాకే వ్యవహారమా.. హీరోల మూర్ఖత్వమా.. హీరోయిన్ల తెలియని తనమా.. ఈ ప్రశ్నకు సమాధానం పైవేవీ కావు. ఎందుకంటే తెలుగు సినిమాను చంపేస్తున్నది పై కారణాలు కావు. ముమ్మాటికి ఒక వ్యవస్థ. దాన్ని వ్యవస్థ అనే దానికంటే మాఫియా అనవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. […]

Telugu Cinema: తెలుగు సినిమాను చంపేస్తున్నది ఎవరు.. పైరసీనా.. కథలేని దర్శకులా.. నిర్మాతల నేల నాకే వ్యవహారమా.. హీరోల మూర్ఖత్వమా.. హీరోయిన్ల తెలియని తనమా.. ఈ ప్రశ్నకు సమాధానం పైవేవీ కావు. ఎందుకంటే తెలుగు సినిమాను చంపేస్తున్నది పై కారణాలు కావు. ముమ్మాటికి ఒక వ్యవస్థ. దాన్ని వ్యవస్థ అనే దానికంటే మాఫియా అనవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్లు గీసింది గీత. వాళ్లు రాసిందే రాత. అడ్డు చెప్పడానికి నిర్మాతలకు ధైర్యం సరిపోదు. హీరోలకు ఖలేజా ఉండదు. ఇక దర్శకులు అంటారా జస్ట్ వాళ్లకు సరెండర్ అయిపోతారు.

ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ నుంచి మొదలు పెడితే రిలీజ్ వరకు అన్ని విషయాలను నిర్మాతలు లేదా దర్శకలు చూసుకునేవారు. హీరోలు కూడా కొన్ని సందర్భాలలో వేలు పెట్టేవారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలను బయటికి చెప్పడంలో నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపించేవి. ఇది ఒక బిజినెస్ మాత్రం లాగా ఉంటుందని భావించి ప్రేక్షకులకు సరికొత్త విషయాలను లీక్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేవి. క్రమక్రమంగా ఈ విషయాలను చేరవేయడానికి వీఆర్వోలు అవసరం ఉండేవారు. అప్పట్లో బిఎ రాజు.. పసుపులేటి రామారావు.. వినాయకరావు.. ఇంకా కొంతమంది దిగ్గజ సినిమా జర్నలిస్టులు ఉండేవారు. వీళ్ళు పిఆర్వోలుగా కూడా పనిచేసేవారు సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తమ కోణంలో బయటపెట్టేవారు. కొన్ని సందర్భాల్లో సినిమా బాగా లేకపోతే కూడా మొహమాటం లేకుండా రాసేవారు.

ఇప్పుడు పిఆర్వోలు ఎలా మారిపోయారు అంటే ఒక ముఠా లాగా రూపాంతరం చెందారు. వ్యవస్థలను మొత్తం చేతిలో పట్టుకున్నారు. సినిమాకు పబ్లిసిటీ విషయాన్ని పక్కన పెడితే.. కొన్ని సైట్లకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు. అందులో కూడా వీరు కమిషన్లు తీసుకుంటున్నారు. పోనీ వీరు ప్రకటనలు ఇస్తున్న సైట్లు ఆ సినిమాల గురించి గొప్పగా రాస్తున్నాయా అంటే అది లేదు. ఇటీవల ఒక సినిమా విడుదలైంది. కనివిని ఎరుగని స్థాయిలో రికార్డులను సాధించింది. ఆ సినిమాకు సంబంధించి పి ఆర్ వో గా పనిచేసిన ఒక వ్యక్తి భారీగానే తీసుకున్నాడు. ఆ సినిమాకు పబ్లిసిటీ చేయడంలో విఫలమయ్యాడు. కొన్ని డమ్మీ సైట్లకు ప్రకటనలు ఇచ్చినట్టు చూపించాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను తన జేబులో వేసుకున్నాడు. ఈ సినిమా మౌత్ టాక్ ద్వారా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాత బతికిపోయాడు. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

సరిగా కొద్ది నెలల క్రితం భారీ అంచనాల మధ్య క్రీడల నేపథ్యంతో ఒక సినిమా విడుదలైంది. గుర్తింపు నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అదరగొట్టింది. కానీ ఈ సినిమాకు పబ్లిసిటీ చేయడంలో పిఆర్వోలు విఫలమయ్యారు. పైగా ప్రకటనలు కూడా తమకు అనుకూలమైన సైట్లకే ఇచ్చుకున్నారు. ఆ సైట్లు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచార మొదలుపెట్టాయి. ఫలితంగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విడుదల కాలేదు. నేటి కాలంలో సినిమా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ.. నటీనటులు.. కథ అద్భుతమైన స్థాయిలో ఉన్నప్పటికీ.. దానిని ప్రజలకు చేరవేయడంలో పిఆర్వోలు ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. కానీ వారు తమ పనిని పక్కనపెట్టి.. నిర్మాతలను ముంచుతూ.. దర్శకులను ఆగం చేస్తూ.. నటీనటులను మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రలో ఐదు అక్షరాల పేరు ఉన్న ఓ పిఆర్ఓ ద్వయం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. దారుణంగా దండుకుంటున్నది. కనీసం సినిమాకి సంబంధించిన ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా ఊరు పేరు లేని సైట్లకు ఇస్తున్నారు. ఆ సైట్లు వీరివే కావడం విశేషం . తద్వారా డబ్బులు మొత్తం వీరి ఖాతాలో పడుతున్నాయి. దీనికి తోడు ఆ సినిమాలకు ఆశించిన స్థాయిలో ప్రచారం లభించకపోవడంతో చివరికి పాజిటివ్ టాక్ రావడం లేదు. దీంతో ఎన్నో రకాల పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ సినిమా ప్రేక్షకుల దగ్గరికి చేరడం లేదు. వాస్తవానికి తెలుగు సినిమాలు చంపేస్తోంది మిగతా కారణాలు కాదు. కేవలం వ్యవస్థీకృత ముఠా లాంటివి పిఆర్వో వ్యవస్థ.. బాలీవుడ్లో పిఆర్ఓ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. సినిమాకు అద్భుతమైన ప్రచారాన్ని కల్పిస్తుంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ, తెలుగులో మాత్రం చెదపురుగులాంటి వ్యవస్థ ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper